ఏడాదికి మీ ఆదాయం ఎంత? : భారీగా తగ్గనున్న పర్సనల్ ట్యాక్స్

వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు గుడ్ న్యూస్. త్వరలో ప్రత్యక్ష పన్ను భారీగా తగ్గనుంది. ప్రస్తుత ఆదాయ పన్ను స్లాబ్ లను భారీగా తగ్గనుంది.

  • Published By: sreehari ,Published On : September 23, 2019 / 02:26 PM IST
ఏడాదికి మీ ఆదాయం ఎంత? : భారీగా తగ్గనున్న పర్సనల్ ట్యాక్స్

Updated On : September 23, 2019 / 2:26 PM IST

వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు గుడ్ న్యూస్. త్వరలో ప్రత్యక్ష పన్ను భారీగా తగ్గనుంది. ప్రస్తుత ఆదాయ పన్ను స్లాబ్ లను భారీగా తగ్గనుంది.

వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు గుడ్ న్యూస్. త్వరలో ప్రత్యక్ష పన్ను భారీగా తగ్గనుంది. ప్రస్తుత ఆదాయ పన్ను స్లాబ్ లు భారీగా తగ్గించునున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. టాస్క్ ఫోర్స్ ప్రతిపాదన మేరకు ప్రత్యక్ష పన్నులో 10 శాతానికి తగ్గించే అవకాశం ఉండనున్నట్టు రిపోర్టు తెలిపింది. దీని ప్రకారం.. వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గింపుపై ఆగస్టు 19, 2019న టాస్క్ ఫోర్స్ సంబంధిత శాఖకు సిఫార్సు చేసింది. వ్యక్తిగత ఆదాయ పన్నుదారులు తమ వినియోగాన్ని పెంచడానికి వారికి విధించే ఆదాయ పన్ను రేట్లను తగ్గించవచ్చునని టాస్క్ ఫోర్స్ తెలిపింది. 

ఏడాదికి 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఆదాయం కలిగిన వ్యక్తులకు 10 శాతం ఆదాయపు పన్ను రేటు ఉండాలని రిపోర్టు ప్రతిపాదించింది. అయితే ప్రస్తుత వ్యక్తిగత ఆదాయ పన్ను రేటు 20 శాతంగా ఉంది. ఏడాదికి రూ .20 లక్షలకు పైగా సంపాదించే వ్యక్తులకు కూడా 30 శాతం ఆదాయపు పన్ను స్లాబ్ విధించాలని నివేదిక కోరింది.

ప్రస్తుతం.. ఏడాదికి రూ .10 లక్షలకు పైగా ఆదాయం ఉండే వ్యక్తులు 30 శాతం ఆదాయపు పన్ను స్లాబ్‌కు లోబడి ఉంటారు. ఏడాదికి రూ. 2 కోట్లకు పైగా ఆదాయాన్ని కలిగి ఉండే వ్యక్తులు కొత్త బ్రాకెట్ కోసం 35 శాతం ఆదాయపు పన్ను రేటు ఉండేలా నివేదిక సిఫార్సు చేసింది. అంతేకాదు.. సర్‌చార్జీలను వదిలేయడం.. ఆదాయపు పన్నుపై విధించే సెస్ కూడా ప్రతిపాదనలో ఒకటిగా టాస్క్ ఫోర్స్ పేర్కొంది. 

కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు:
పరిశ్రమల్లో పెట్టుబడులను పున: ప్రారంభించడానికి వీలుగా గతవారమే ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలను ప్రకటించింది. దేశీయ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటును 22 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి సంస్థకు మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఆమె ఉండవన్నారు. ఈ కంపెనీలు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మాట్) కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

ఈ సందర్భంలో ప్రభావవంతమైన పన్ను రేటు సెస్, సర్‌చార్జీతో సహా మొత్తంగా 25.17 శాతం వరకు ఉంటుందని ప్రకటించారు. ఉత్పత్తుల తయారీల్లో కొత్త పెట్టుబడులు పెట్టే కొత్త దేశీయ కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ పన్ను రేటును మంత్రి నిర్మల ప్రకటించారు. ఈ కంపెనీలు 2023 మార్చి 31న లేదా అంతకు ముందే ఉత్పత్తిని ప్రారంభించి ఉండాలి. అప్పుడే కనీస ప్రత్యామ్నాయ పన్ను (MAT) నుంచి మినహాయింపు పొందుతాయి.