Mercedes Benz Car Prices : పెరగనున్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా కార్ల ధరలు, ఎప్పటినుంచో తెలుసా? ఇప్పుడే కొనేసుకోండి!
Mercedes Benz Car Prices : దేశంలోని అతిపెద్ద లగ్జరీ కార్ల తయారీ కంపెనీ, మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను 5శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది.

Mercedes-Benz Car Prices _ Mercedes-Benz India to increase car prices from April 1
Mercedes Benz Car Prices : దేశంలోని అతిపెద్ద లగ్జరీ కార్ల తయారీ కంపెనీ, మెర్సిడెస్-బెంజ్ ఇండియా (Mercedes-Benz Car) ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను 5శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల పెంపు పోర్ట్‌ఫోలియో అంతటా వర్తించుంది. కంపెనీ ప్రకారం.. యూరోతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. లాజిస్టిక్స్ ఖర్చులతో సహా పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు, మొత్తం కార్యాచరణ ఖర్చులపై గణనీయమైన ఒత్తిడిని చూపాయి.
ఈ కారణాల వల్లే మెర్సిడెస్-బెంజ్ ఇండియా తన మోడల్ రేంజ్ ఎక్స్-షోరూమ్ ధరను అమాంతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఖర్చులలో కొన్నింటిని భర్తీ చేసేందుకు సవరించడానికి దారితీసింది. కంపెనీ గణనీయమైన ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తోంది. అయితే, దానిలో కొంత భాగాన్ని యూజర్లపై బనాయించనుంది. మెర్సిడెస్-బెంజ్ కార్లలో, A-క్లాస్ లిమోసిన్, GLA SUV ధరలు రూ. 2 లక్షలు, S 350d లిమోసిన్ రూ. 7 లక్షలు, మేబ్యాక్ S 580 లగ్జరీ లిమోసిన్ ధర రూ. 12 లక్షల వరకు ఉంటుంది.

Mercedes Benz Car Prices _ Mercedes-Benz India to increase car prices
Mercedes-Benz నెక్స్ట్-జెన్ టెక్నాలజీ, కనెక్ట్ చేసిన సర్వీసులు, లగ్జరీ అపాయింట్‌మెంట్‌లు, విభిన్న కస్టమర్ సర్వీస్‌లను కలిగిన సరికొత్త మోడల్ లైనప్‌ను అందిస్తుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులతో పాటు కరెన్సీ బలహీనత కారణంగా కార్యాచరణ ఖర్చులు పెరిగాయి.
ఈ క్రమంలో Mercedes-Benz ఇండియా క్యాలెండర్ ఏడాదిలో (CY) 2022లో 15,822 యూనిట్లకు అత్యధిక వాల్యూమ్‌లను రిజిస్టర్ చేసినట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, CEO సంతోష్ అయ్యర్ తెలిపారు. ఈ కంపెనీ 8వ ఏడాదిలో దేశంలోనే అతిపెద్ద లగ్జరీ కార్ల తయారీ సంస్థగా నిలిచింది. మరో పోటీదారు లగ్జరీ బ్రాండ్ BMW ఇండియా CY22లో 11,268 యూనిట్లను విక్రయించగా, AUDI ఇండియా 4,187 యూనిట్లను విక్రయించింది.