ధర ఎంతో తెలుసా?: 108MP భారీ కెమెరాతో Mi CC9 Pro వచ్చేసింది

  • Published By: sreehari ,Published On : November 6, 2019 / 01:22 PM IST
ధర ఎంతో తెలుసా?: 108MP భారీ కెమెరాతో Mi CC9 Pro వచ్చేసింది

Updated On : November 6, 2019 / 1:22 PM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా Mi CCP9 సిరీస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ బుధవారం (నవంబర్ 6, 2019) మొబైల్ ఈవెంట్ లో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ అధికారిక రిలీజ్ కాకముందే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కారణం.. 108MP భారీ కెమెరా డిజైన్ ఉండటమే. Mi CC9 ప్రో.. AMOLED స్ర్కీన్, స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్, MIUI 11 సాఫ్ట్ వేర్, గ్రేడియేంట్ ఫినీష్, గ్లాస్ బాడీ సహా అనేక టాప్ నాచ్ ఫీచర్లతో వస్తోందని పుకార్లు వినిపించాయి. 

Mi CC9 ప్రో.. షియోమీ ఇండస్ట్రీలోనే తొలి స్మార్ట్ ఫోన్ కాగా.. 108MP భారీ కెమెరా సెన్సార్‌తో వచ్చింది. ఇందులో మొత్తం 6 కెమెరాలు ఉండగా, 5 కెమెరాలు వెనుక, ఒక కెమెరా సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ ఉంది. MiCC9 ప్రో ఫోన్.. మూడు కాన్ఫిగరేషన్స్‌లో వస్తోంది. బేస్ మోడల్ (6GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజీ). దీని ధర చైనా మార్కెట్లలో 2799 యాన్స్ (రూ.28వేలు) నిర్ణయించారు. రెండో మోడల్ (8GB ర్యామ్ + 128GB స్టోరేజీ). దీని ధర 3099 యాన్స్ (రూ.31వేలు). 

చివరిగా మూడో మోడల్ (8GB ర్యామ్ + 256GB స్టోరేజీ). దీని ధర 3499 యాన్స్ (రూ.35వేలు)గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం.. Mi CC9 ప్రో.. చైనాలో మాత్రమే లాంచ్ అయింది. నవంబర్ 6న గ్లోబల్ వెర్షన్ రిలీజ్ అయింది. Mi Note 10 త్వరలో మ్యాడ్రిడ్, స్పెయిన్ దేశాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Mi Note 10 లేదా Mi CC9 ప్రో ఇండియా మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదానిపై సరైన వివరాలు అందుబాటులో లేవు. 

స్పెషిఫికేషన్లు – ఫీచర్లు ఇవే :
* 108MP కెమెరా f/1.69 aperture బిగ్ 1/1.33-అంగుళాల సెన్సార్ 
* 6.47-అంగుళాల FHD+ AMOLED స్ర్కీన్ 
* 2340 x 1080 ఫిక్సల్స్ స్ర్కీన్ రెజుల్యూషన్ 
* డాట్ డ్రాప్ నాచ్ (స్కీన్ టాప్)
* 32MP సెల్ఫీ కెమెరా (టాప్ నాచ్)
* మినిమల్ బెజిల్స్, కర్వ్‌డ్ అంచులు
* క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్ SoC
* 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజీ 
* 6GB RAM +128GB ఇంటర్నల్ స్టోరేజీ 
* 8GB RAM + 128GB స్టోరేజీ 
* 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజీ
* 5260mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 
* in-display ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
* 5MP టెలిఫొటో లెన్స్ 10x hybrid జూమ్, OIS
* 12MP portrait లెన్స్, 20MP ultra-wide-angle లెన్స్ 
* 2MP macro లెన్స్, 32MP కెమెరా (సెల్ఫీలు)
* Night mode ఎఫెక్ట్ కెమెరాలు