ఉబర్‌లో ఎక్కువగా ఫోన్‌నే మర్చిపోతున్నారట

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్ చేతిలోనో పాకెట్‌లోనో ఉండాల్సిందే. ఫోన్ లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది అనడంలో సందేహం లేదు.

  • Published By: vamsi ,Published On : March 7, 2019 / 12:02 PM IST
ఉబర్‌లో ఎక్కువగా ఫోన్‌నే మర్చిపోతున్నారట

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్ చేతిలోనో పాకెట్‌లోనో ఉండాల్సిందే. ఫోన్ లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది అనడంలో సందేహం లేదు.

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్ చేతిలోనో పాకెట్‌లోనో ఉండాల్సిందే. ఫోన్ లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. మెజారిటీ పీపుల్ ఫోన్‌కు అడిక్ట్ అయిపోయారు. అటువంటి ఫోన్‌ను భారతీయులు మాత్రం మర్చిపోతున్నారట. ప్రముఖ క్యాబ్‌ సర్వీసుల సంస్థ ఉబర్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఉబర్ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌ ఇండెక్స్‌’ సర్వేలో ఈ విషయాన్ని సంస్థ వెల్లడించింది. భారతీయులు ఫోన్లతో పాటు బంగారు ఆభరణాలు, అరటిపళ్లు, కూరగాయలు, చేపలను క్యాబ్‌లలో మర్చిపోతున్నారట. అయితే ఇలాంటి ఘటనలు ఎక్కువగా బెంగళూరులోనే జరుగుతున్నాయట. దీంతో బెంగళూరు ‘మోస్ట్‌ ఫర్గెటబుల్‌ సిటీ’గా నిలిచింది. దీని తర్వాతి స్థానంలో ఢిల్లీ, ముంబై నగరాలు ఉన్నాయి.
Also Read : ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం

ఇలా మర్చిపోతున్న వస్తువుల జాబితా టాప్‌-10లో వాలెట్స్‌, తాళాలు, దుస్తులు, గొడుగులు, విలువైన పత్రాలు ఉన్నాయి. అయితే వస్తువులను మర్చిపోతున్న కేసులు మిగిలిన రోజుల కంటే వీకెండ్స్‌లో ఎక్కువగా నమోదవుతున్నట్లు సంస్థ తెలిపింది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చేసిన ఈ సర్వేలో సెప్టెంబర్‌‌లో అత్యధికంగా వస్తువులను కష్టమర్లు మర్చిపోయినట్లు సంస్థ తెలిపింది. అందులోనూ 1, 2, 8 తేదీలలోనే ఎక్కువమంది వస్తువులను వదిలేశారట. ఉబర్‌ క్యాబ్‌లలో వస్తువులను మర్చిపోయిన ఘటనలకు సంబంధించి ఫిర్యాదు చేసే సౌకర్యం ఉంది.
Also Read : చావుతో చెలగాటం.. అయినా వదల్లేదు : కారు బానెట్ పై 2కి.మీ వెళ్లాడు