Most Safest Cars : కొత్త కారు కావాలా? భారత్‌లో రూ. 10 లక్షల లోపు సేఫెస్ట్ 5 స్టార్ రేటింగ్ కార్లు ఇవే.. ఈ 5 కార్లలో ఏదైనా కొనేసుకోండి!

Most Safest Cars : భారత మార్కెట్లో అత్యంత సేఫెస్ట్ 5 స్టార్ రేటింగ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. టాటా, కియా, మహీంద్రా, స్కోడా వంటి కార్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కారు ఇంటికి తెచ్చుకోండి.

Most Safest Cars : కొత్త కారు కావాలా? భారత్‌లో రూ. 10 లక్షల లోపు సేఫెస్ట్ 5 స్టార్ రేటింగ్ కార్లు ఇవే.. ఈ 5 కార్లలో ఏదైనా కొనేసుకోండి!

Most Safest Cars

Updated On : April 20, 2025 / 6:42 PM IST

Most Safest Cars : కొత్త కారు కొంటున్నారా? అయితే, మీకోసం అత్యంత సురక్షితమైన కార్లు భారత మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ రోజుల్లో కారు కొనేటప్పుడు చాలామంది సేఫ్టీకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సిటీలో అయినా, గ్రామమైనా, ప్రతి ఒక్కరూ సురక్షితమైన కారును కోరుకుంటారు.

Read Also : Recharge Plans : నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? 365 రోజుల వ్యాలిడిటీ, 600GB డేటా ప్లాన్లు ఇవే.. మీ నెట్‌వర్క్ ఏదైనా..!

ఇప్పుడు బడ్జెట్ కార్లలో కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్లు సర్వసాధారణమైంది. మీరు రూ. 10 లక్షల బడ్జెట్‌లో కొత్త కారు కొనాలని చూస్తుంటే.. మీకోసం అద్భుతమైన కార్లు అందుబాటులో ఉన్నాయి. సేఫ్టీ పరంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన 5 బెస్ట్ కార్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన కారును ఎంచుకుని కొనేసుకోవచ్చు.

కియా సెల్టోస్ :
కియా సెల్టోస్ అనేది సేఫ్టీకి సరైన కారు. భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, బ్యాక్ ISOFIX మౌంట్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫీచర్లు మీతో పాటు మీ కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకుని కంపెనీ రూపొందించింది. ఈ కారు ప్రారంభ ధర సుమారు రూ. 9 లక్షలు ఉంటుంది. చాలా సురక్షితమైన SUV కారుగా చెప్పవచ్చు.

టాటా నెక్సన్ :
భారత మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్లలో టాటా నెక్సాన్ ఒకటి. ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. మీ బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంది. పెట్రోల్, డీజిల్, CNG వెర్షన్‌లతో పాటు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు కాగా, సేఫ్టీ, బడ్జెట్ కొనుగోలుదారులకు సరైన ఆప్షన్.

మహీంద్రా XUV300 :
మహీంద్రా XUV300 కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన బెస్ట్ కారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో ఈ కారు లభిస్తుంది. పూర్తిగా సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర కూడా రూ. 7.99 లక్షలు. మిడ్ రేంజ్ బడ్జెట్ కలిగిన కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన కారుగా చెప్పవచ్చు.

స్కోడా కుషాక్ :
కొత్త స్కోడా కుషాక్ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. చాలా సురక్షితమైన కారు. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ADAS లేకపోయినా, సేఫ్టీ పరంగా ఈ కారు చాలా బెస్ట్. రూ. 7.89 లక్షల ప్రారంభ ధరతో టాటా నెక్సాన్, మహీంద్రా XUV300 కన్నా కొంచెం చౌకైన ధరకే కొనుగోలు చేయొచ్చు.

Read Also : Amazon Mobile Deals : సూపర్ ఆఫర్లు భయ్యా.. అమెజాన్‌‌లో ఈ 3 స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు.. చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి!

టాటా పంచ్ :
టాటా పంచ్ అత్యంత సరసమైనది. చాలా సురక్షితమైన కారు. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. మీ ఫ్యామిలీతో పాటు మీకు అత్యంత భద్రతను అందిస్తుంది. టాటా పంచ్ పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ వెర్షన్లలో కూడా అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది కస్టమర్లకు టాటా పంచ్ కారు అందుబాటులో ఉంటుంది. ఈ కారు పూర్తిగా బడ్జెట్-ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో బాగా పాపులర్ అవుతోంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 6.19 లక్షలు, సేఫ్టీ కోసం చూస్తున్న బడ్జెట్ కొనుగోలుదారులకు ఈ కారు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.