Moto G64 5G Launch : ఈ నెల 16న భారత్‌కు మోటో G64 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Moto G64 5G Launch : భారత మార్కెట్లోకి మోటోరోలా కంపెనీ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 16న మోటో G64 5జీ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Moto G64 5G Launch : ఈ నెల 16న భారత్‌కు మోటో G64 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Moto G64 5G will launch in India on April 16

Moto G64 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఈ ఏప్రిల్ నెలలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటోరోలా నుంచి సరికొత్త మోటో ఫోన్ వచ్చేస్తోంది. ఇటీవలే మోటో ఎడ్జ్ 40ప్రో లాంచ్ అయిన తర్వాత మోటోరోలా మరో స్మార్ట్‌ఫోన్‌ మోటో G64 5జీ ఫోన్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై ఏకంగా రూ.50వేలు తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

ఈ ఫోన్ మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ కాగా.. కంపెనీ జీ-సిరీస్ కింద లాంచ్ చేయనుంది. మోటో G64 ఫోన్ గత ఏడాదిలో మోటో G54 ఫోన్ కు అప్‌గ్రేడ్ వెర్షన్. షెడ్యూల్ ప్రకారం. ఏప్రిల్ 16న భారత్‌లో లాంచ్ కానుంది. అయితే, ఈ లాంచ్ ఈవెంట్‌కు ముందుగానే 5జీ స్మార్ట్‌ఫోన్ ధర మినహా స్మార్ట్‌ఫోన్ అన్ని వివరాలను వెల్లడిస్తూ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రివీల్ చేసింది.

స్పెషిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
మోటో G64 ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మకానికి రానుందని మోటోరోలా ధృవీకరించింది. ఆఫ్‌లైన్‌లో అధికారిక అధీకృత రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్‌లో మోటో G64 5జీ ఫోన్ స్పెసిఫికేషన్ జాబితాను వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో పాటు 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 20:9 అస్పాక్ట్ రేషియోను అందిస్తుంది.

మొత్తం 3 కలర్ ఆప్షన్లలో :
ఈ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. కంపెనీ 3ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్, ఆండ్రాయిడ్ 15.3 వరకు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ని అందిస్తుంది. మోటో జీ64లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్ 2.5Ghz ఆక్టా-కోర్ సీపీయూతో పాటు రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. అందులో ఒకటి.. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, మరొకటి 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. మోటోరోలా జీ64 5జీ మొత్తం మింట్ గ్రీన్, పెరల్ బ్లూ, ఐస్ లిలక్ అనే 3 కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. :
మోటో G64 ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్/1.8 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50ఎంపీ సెన్సార్, 118-డిగ్రీ యాంగిల్‌తో 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. రెండో సెన్సార్ మాక్రో, డెప్త్ ఫోటోగ్రఫీకి కూడా సపోర్టు ఇస్తుంది. మోటో జీ64లో స్టీరియో స్పీకర్లు, రెండు మైక్రోఫోన్‌లు, 3.5 ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 14 5జీ బ్యాండ్‌లు, బ్లూటూత్ 5.3, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్‌లకు సపోర్టు ఇస్తుంది. ఈ మోటో జీ64 5జీ ఫోన్ ధర వివరాలను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.

Read Also : Oppo A3 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో A3 ప్రో ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?