Motorola Edge 30 Series : 200MP కెమెరాలతో మోటోరోలా ఎడ్జ్ 30 సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?
Motorola Edge 30 Series : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola Edge Series) ప్రీమియం ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను అందించింది. మోటోరోలా నుంచి Edge 30 Ultra, Edge 30 Fusion అనే రెండు డివైజ్‌లను లాంచ్ చేసింది.

Motorola Edge 30 Series, Motorola Edge 30 Ultra, Motorola Edge 30 Fusion, Motorola Edge 30
Motorola Edge 30 Series : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola Edge Series) ప్రీమియం ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను అందించింది. మోటోరోలా నుంచి Edge 30 Ultra, Edge 30 Fusion అనే రెండు డివైజ్‌లను లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్, 200-MP ప్రైమరీ రియర్ కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మోటోరోలా X30 Pro మోనికర్ కింద కంపెనీ ఫస్ట్ ఈ డివైజ్‌ను ఆగస్టులో చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. మరోవైపు, Edge 30 Fusion స్నాప్‌డ్రాగన్ 888+తో వస్తుంది. Asus ROG 5S, Vivo X70 Pro+, iQoo 9 వంటి కొన్ని ఓల్డ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లకు సపోర్టు అందిస్తుంది. Motorola లేటెస్ట్ స్మార్ట్ఫోన్లతో ఎడ్జ్ సిరీస్‌లో కర్వడ్ డిస్ప్లేలను రిప్రెష్ చేసింది.

Motorola Edge 30 Series, Motorola Edge 30 Ultra, Motorola Edge 30 Fusion, Motorola Edge 30
భారత్‌లో Motorola Edge 30 సిరీస్ ధర ఎంతంటే? :
Edge 30 Ultra ఒకే (8GB RAM + 128GB స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 59,999 ధరతో వచ్చింది. ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో Edge 30 Ultra వేరియంట్ అందుబాటులో ఉంటుంది రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సమయంలో ఈ ఫోన్ రూ. 54,999కి అందుబాటులో ఉంటుంది. మరోవైపు, Edge 30 Fusion వేరియంట్.. స్టోరేజ్ మోడల్‌కు రూ. 42,999 ధరను కలిగి ఉంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ధర డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంటుంది. యూజర్లు ఈ వేరియంట్‌ను రూ. 39,999కి కొనుగోలు చేయవచ్చు. Motorola భారత మార్కెట్లో స్టోరేజీ ఆప్షన్ మళ్లీ 128GBకి పరిమితం చేసింది. రిలయన్స్ డిజిటల్ (Reliance Digital)తో సహా ప్రముఖ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయి.
Motorola Edge 30 Ultra అల్ట్రా స్పెసిఫికేషన్స్ ఇవే :
మోటోరోలా Ultra, Fuison రెండు వేరియంట్లు ఒకేలా కనిపిస్తాయి, కానీ, డిజైన్ పరంగా ఇప్పటికే ఉన్న Edge 30 Proకు చాలా భిన్నంగా ఉంది. ఈ రెండు కొత్త ఫోన్లు కర్వ్డ్ డిస్ప్లే, ఫ్లాట్ ఎడ్జ్‌లతో వచ్చాయి. Dolby Atmos బ్రాండింగ్‌తో వచ్చింది. Motorola Edge 30 Ultra మూడు ఏళ్ల ఆండ్రాయిడ్ OS (13,14, 15) అప్డేట్లతో వచ్చింది. నాలుగు ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకోవచ్చు. 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.67-అంగుళాల ఎండ్లెస్ ఎడ్జ్ (కర్వ్డ్) పోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. Motorola బ్యాటరీ గేమ్‌ను కూడా పెంచింది. Edge 30 Ultra, 4,610mAh బ్యాటరీతో వస్తుంది. 125W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

Motorola Edge 30 Series, Motorola Edge 30 Ultra, Motorola Edge 30 Fusion, Motorola Edge 30
సెల్లింగ్ పాయింట్‌కి వస్తే.. కెమెరా సిస్టమ్, OIS సపోర్టుతో వెనుకవైపు 200-MP శాంసంగ్ సెన్సార్ ఉంది. ప్రైమరీ కెమెరా 50-MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో పాటు మాక్రో కెమెరాగా వచ్చింది. 12-MP పోర్ట్రెయిట్ సెన్సార్ కూడా ఉంది. ప్రైమరీ కెమెరా 30fps వద్ద 8K రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 60-MP ఫ్రంట్ కెమెరా 4K రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. Edge 30 Ultra ఇతర ఫీచర్లతో Wi-Fi 6e, Dual-SIM కార్డ్‌లు, 5G , NFC ఉన్నాయి. ఇంటర్స్టెల్లార్ బ్లాక్, స్టార్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Motorola Edge 30 Series, Motorola Edge 30 Ultra, Motorola Edge 30 Fusion, Motorola Edge 30
Motorola Edge 30 Fusion స్పెసిఫికేషన్స్ ఇవే :
మోటోరోలా Edge 30 Fusion రెండు ఏళ్లపాటు OS అప్డేట్లను అందించనుంది. Edge 30 Ultraకు సమానమైన స్పెసిఫికేషన్లతో చిన్న 6.5-అంగుళాల కర్వడ్ డిస్ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ కేవలం 68W వైర్డు ఛార్జింగ్‌తో చిన్న 4,400mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా సిస్టమ్‌లో OISతో 50-MP ప్రైమరీ కెమెరా, 13-MP అల్ట్రా-వైడ్ సెన్సార్, డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్‌లో 32-MP కెమెరా ఉంది. ప్రైమరీ రియర్ కెమెరా 8K వీడియోని కూడా రికార్డ్ చేయవచ్చు. Motorola Edge 30 Fusionలోని ఇతర ఫీచర్లలో 5G, డ్యూయల్-సిమ్ కార్డ్‌లు, బ్లూటూత్ 5.2, Wi-Fi 6e, NFC ఉన్నాయి. ఈ వేరియంట్ కాస్మిక్ గ్రే, సోలార్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.