Motorola Edge 50 Fusion : భలే ఆఫర్ బాస్.. అతి చౌకైన ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!
Motorola Edge 50 Fusion : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ ధరపై ఏకంగా రూ. 17,500 ధర తగ్గింది.

Motorola Edge 50 Fusion
Motorola Edge 50 Fusion : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మోటరోలా (Motorola Edge 50 Fusion) ఫోన్ కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది.
Read Also : Apple Store : గుడ్ న్యూస్.. భారత్‌లో త్వరలో మూడో ఆపిల్ స్టోర్.. ఎక్కడో తెలుసా? అద్దె రూ. 2.9 కోట్లు అంట..!
తద్వారా రూ. 17,500 లోపు ఈ ఫ్యూజన్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ఈ డీల్ ముగియకముందే కొనేసుకోవడం బెటర్. ఇంతకీ ఈ డిస్కౌంట్ ఎలా పొందాలో చూద్దాం.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఆఫర్ :
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ.22,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.18,999కి లిస్టు అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌పై రూ.4వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ.1,500 డిస్కౌంట్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ధర తగ్గాలంటే పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేయొచ్చు.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion) 6.7-అంగుళాల FHD+ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
హుడ్ కింద, ఎడ్జ్ 50 ఫ్యూజన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC ద్వారా అడ్రినో 710 జీపీయూతో వస్తుంది. స్టోరేజ్ ఆప్షన్లలో 12GB వరకు LPDDR4X ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ సోనీ LYTIA 700C 50MP OIS-ఎనేబుల్డ్ ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కూడా ఉంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.