Motorola Edge 50 Pro : కొత్త ఫోన్ కావాలా? మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50ప్రో అదిరిపోయే డిస్కౌంట్.. అమెజాన్‌లో చౌకైన ధరకే ఇలా సొంతం చేసుకోవచ్చు.

Motorola Edge 50 Pro
Motorola Edge 50 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కొనేసుకోవచ్చు. ఆకర్షణీయమైన (Motorola Edge 50 Pro) ఇంటర్‌ఫేస్, పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే కెమెరాలు కలిగి ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ మోటోరోలా ఫోన్ రూ.9వేల తగ్గింపుతో లభిస్తోంది.
12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ తగ్గింపు తర్వాత రూ.35,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ మోటోరోలా ఫోన్‌లో వీగన్ లెదర్ బ్యాక్, పవర్‌ఫుల్ POLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. రూ.30వేల లోపు ధరలో ఫోన్ కోసం చూస్తుంటే.. మిడ్-రేంజ్ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అసలు వదులుకోవద్దు.
అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర :
ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో రూ.28,999 ధరకు లభిస్తుంది. ప్రారంభ ధర కన్నా రూ.7వేలు తక్కువకే లభిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, నెలకు రూ.1,399 నుంచి ఈఎంఐని కూడా అందిస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐ కోసం ఆప్షన్లు ఉన్నాయి.
Read Also : IT Notices : బిగ్ అలర్ట్.. ఈ 10 లావాదేవీలపై ఐటీ నిఘా.. ఏ క్షణమైన మీ ఇంటికి IT నోటీసులు రావొచ్చు..!
కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.26,999 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. అయితే, కచ్చితమైన వాల్యూ వర్కింగ్ కండిషన్లు, ఫోన్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోలో 6.7-అంగుళాల 1.5K pOLED ప్యానెల్, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ మోటోరోలా 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 125W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
అదనంగా, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 50MP OIS ప్రైమరీ షూటర్‌తో పాటు 13MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.