Narayana Murthy : ‘నన్ను క్షమించండి.. పని గంటలపై నాది అదేమాట.. తుదిశ్వాస వరకు మారదు.. ఇన్ఫోసిస్ మూర్తి

Narayana Murthy : పనిగంటలపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని నారాయణ మూర్తి స్పష్టంచేశారు. పని-జీవిత సమతుల్యతపై తన అభిప్రాయాలను మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు.

Narayana Murthy : ‘నన్ను క్షమించండి.. పని గంటలపై నాది అదేమాట.. తుదిశ్వాస వరకు మారదు.. ఇన్ఫోసిస్ మూర్తి

Narayana Murthy calls India’s transition

Updated On : November 15, 2024 / 9:39 PM IST

Narayana Murthy : ప్రముఖ ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఐదు రోజుల పని విధానంపై మళ్లీ స్పందించారు. పనిగంటలపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. పని-జీవిత సమతుల్యతపై తన అభిప్రాయాలను మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు. వారానికి 5 రోజుల పనిగంటలు కాదు.. అందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి సూచించారు.

1986లో భారత్ 6 రోజుల పనివారం నుంచి ఐదుకు మారడం తనను నిరాశకు గురిచేసిందని చెప్పారు.. “నన్ను క్షమించండి.. నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఇదే మాటను నా తుదిశ్వాస వరకు కొనసాగిస్తాను” సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో షెరీన్ భాన్‌తో చెప్పారు. తన దృష్టిలో అపర కృషి దేశ ప్రగతికి మూలస్తంభంగా మూర్తి పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ప్రఖ్యాతిగాంచిన 100 గంటల పనివారలను ఉదాహరణగా చూపారు. “ప్రధాని మోదీ చాలా కష్టపడి పనిచేస్తున్నప్పుడు.. మనం కూడా అలానే కష్టపడి పనిచేస్తూ ప్రశంస చూపించడమే ఏకైక మార్గం. భారత అభివృద్ధికి త్యాగం అవసరం, విశ్రాంతి కాదు’’ అని మూర్తి తెలిపారు. ఉద్యోగం పట్ల తనకున్న అంకితభావాన్ని మూర్తి స్పష్టం చేశారు. తన కెరీర్‌లో ఎక్కువ భాగం రోజుకు 14 గంటల పని, వారంలో ఆరున్నర రోజులు పనిచేసినట్టు తెలిపారు. ఉదయం 6:30 గంటలకు ఆఫీసుకు చేరుకుని రాత్రి 8:40 గంటలకు ఇంటికి బయలుదేరేవాడినని, కష్టపడి పనిచేసేతత్వం భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయిందని ఈ విషయంలో చాలా గర్విస్తున్నానని మూర్తి చెప్పుకొచ్చారు.

మిలీనియల్స్ వారానికి కనీసం 70 గంటలు పని చేయమని గత ఏడాదిలో మూర్తి ప్రోత్సహించడం వివాదాస్పదమైంది. ఈ దేశంలో మనం కష్టపడి పనిచేయాలి. మీరు చాలా తెలివైన వ్యక్తి అయినా కష్టానికి ప్రత్యామ్నాయం లేదన్నారు. భారత్ పని నీతిని (WWII) అనంతర జర్మనీ, జపాన్‌లతో పోల్చారు. ఆయా దేశాల ప్రజలు తమ దేశాలను పునర్నిర్మించడానికి చేసింది ఇదేనని మూర్తి స్పష్టం చేశారు. యువ భారతీయులు తమకూ దేశానికి కూడా రుణపడి ఉంటారని తెలిపారు.

Read Also : Narendra Modi : ఝార్ఖండ్‌లో ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం.. ఆలస్యంగా ఢిల్లీకి పయనం!