Narendra Modi : ఝార్ఖండ్‌లో ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం.. ఆలస్యంగా ఢిల్లీకి పయనం!

Narendra Modi : ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్లేందుకు ప్రధాని మోదీ విమానాశ్రయానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Narendra Modi : ఝార్ఖండ్‌లో ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం.. ఆలస్యంగా ఢిల్లీకి పయనం!

PM Modi’s Aircraft Faces Technical Snag in Jharkhand,

Updated On : November 15, 2024 / 8:37 PM IST

Narendra Modi : ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. శుక్రవారం (నవంబర్ 15) ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లేందుకు డియోఘర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, మోదీ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో మోదీ విమానాన్ని ఝార్ఖండ్‌లోనే నిలిపివేశారు. దేశ రాజధానికి మోదీ తిరిగి రావడం ఆలస్యమైందని సంబంధిత అధికారులు తెలిపారు.

ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్లేందుకు ప్రధాని మోదీ విమానాశ్రయానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన అధికారులు పరిస్థితిపై వేగంగా స్పందించి విమానాన్ని అక్కడే నిలిపివేశారు. టెక్నికల్ బృందాలు సమస్యను పరిష్కరించినట్టు అధికారులు వెల్లడించారు.

ప్రధాని ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపానికి గల కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. గిరిజన వీరుడు బిర్సా ముండాను సన్మానించే కార్యక్రమంలో భాగంగా ఝార్ఖండ్‌లో జన్ జాతీయ గౌరవ్ దివస్ వేడుకల్లో భాగంగా ప్రధాని ఈరోజు రెండు ర్యాలీలు నిర్వహించారు. నవంబర్ 20న జరగనున్న ఝార్ఖండ్ ఎన్నికల చివరి దశ ఓటింగ్‌కు కొద్ది రోజుల ముందు ఈ ర్యాలీలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

మరోవైపు.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రయాణించే హెలికాప్టర్‌లో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి క్లియరెన్స్ కోసం ఎదురుచూసే క్రమంలో గొడ్డాలో ఛాపర్ గ్రౌండింగ్ చేయడంతో ఆలస్యమైంది. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ భారీ ప్రచారం మధ్య 45 నిమిషాల ఆలస్యమైన తర్వాత హెలికాప్టర్ బయలుదేరింది.

ఝార్ఖండ్‌లో గాంధీ ఎన్నికల ప్రచారాన్ని అంతరాయం కలగడం వెనుక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. గూడా నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీఎం మోడీ చకాయ్ ర్యాలీ కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఏటీసీ ప్రతిపక్ష నేత కన్నా ప్రధానమంత్రి ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిందని ఆరోపణలు గుప్పించారు.

Read Also : SBI Loans Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. లోన్లపై వడ్డీ రేట్లు మరింత ప్రియం.. ఎన్ని పాయింట్లు పెరిగిందంటే?