బంగారంపై వస్తున్న వార్తల్లో నిజమిదే

నల్లధనాన్ని అరికట్టేందుకు మోడీ సర్కార్ గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్‌ను తీసుకుని వచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రశీదులేని బంగారం వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే రేటు ప్రకారం దీనికి పన్ను చెల్లించాలి. కేంద్రం చెప్పినదాని కంటే ఎక్కువ బంగారం ఉంటే వాటికి భారీగా జరిమానా విధిస్తారు.
ఇన్‌కమ్ ట్యాక్స్, ఆమ్నెస్టీ స్కీమ్ మాదిరిగానే గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్ కూడా నిర్దేశిత కాలం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ కాలంలో బంగారం వివరాలను ప్రభుత్వానికి అందజేయాలి. అప్పుడు జరిమానాతో బయటపడొచ్చు. అదే స్కీమ్ కాలం ముగిసిన తర్వాత రశీదులేని బంగారం ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టం ఉండబోతుందంటూ,పెద్దమొత్తంలో నల్లడబ్బును పసిడిలో పెట్టుబడి కింద పెడుతుండడంతో దీనిని అరికట్టేందుకు గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్ పై కేంద్రం సీరియస్ గానే చర్చిస్తున్నట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు ఒట్టి పుకార్లు మాత్రమేనని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అసలు బంగారం రూపంలో లెక్కించని సంపదను వెలికితీసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏ బంగారు పథకాన్ని పరిగణించలేదని అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి. మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లుగానే అధికారులు కొట్టిపారేశారు. బడ్జెట్ బడ్జెట్ ప్రక్రియ కొనసాగుతున్నందున, సాధారణంగా ఈ రకమైన ఊహాజనిత వార్తలు బడ్జెట్ ప్రక్రియ కంటే ముందుగానే కనిపిస్తుంటాయని అధికారులు తెలిపారు.