Nothing Phone 2a Launch : నథింగ్ ఫోన్ 2ఎ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ధర, ఫీచర్లు వివరాలు లీక్..

Nothing Phone 2a Launch : నథింగ్ కంపెనీ నుంచి కొత్త నథింగ్ ఫోన్ 2ఎ రాబోతోంది. కొత్త నథింగ్ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. రాబోయే నథింగ్ ఫోన్ 2ఎ లాంచ్ టైమ్‌లైన్, స్పెక్స్, ధర వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

Nothing Phone 2a Launch : నథింగ్ ఫోన్ 2ఎ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ధర, ఫీచర్లు వివరాలు లీక్..

Nothing Phone 2a launch timeline, price, specs and other details tipped

Updated On : December 18, 2023 / 9:51 PM IST

Nothing Phone 2a Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ నథింగ్ ఫోన్ (2)కి మరో అప్‌గ్రేడ్ వెర్షన్ నథింగ్ ఫోన్ 2ఎ గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. రాబోయే ఈ నథింగ్ ఫోన్ 2ఎ గురించి ముందుగానే పుకార్లు బయటకు వచ్చాయి. లీకైన వివరాల ప్రకారం.. స్పెసిఫికేషన్‌లు, డిజైన్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read Also : Hero Vida V1 e-scooter : 2023 ఇయర్ ఎండ్ సేల్.. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుపై ఎంత ఆదా చేసుకోవచ్చుంటే?

ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించి కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. నథింగ్ ఫోన్ 2ఎ ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. నథింగ్ ఫోన్ (2) బడ్జెట్-ఫ్రెండ్లీ ధరతో రాబోయే నథింగ్ ఫోన్ 2ఎ ధర సమానంగా ఉండవచ్చునని లీక్‌ డేటా సూచిస్తోంది.

నథింగ్ ఫోన్ 2ఎ లాంచ్ టైమ్‌లైన్, ధర :
టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ X వేదికగా నథింగ్ ఫోన్ 2ఎ ఫోన్ ఫిబ్రవరిలో 2024 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ డివైజ్ 400 డాలర్ల ఖర్చవుతుందని, భారతీయ కరెన్సీలో సుమారు రూ. 33,200 అని బ్రార్ పేర్కొంది.

నథింగ్ ఫోన్ 2ఎ ఫొటోలు, స్పెషిఫికేషన్లు లీక్ :
నథింగ్ ఫోన్ 2ఎ మోడల్ ప్రొడక్షన్ వాలిడేషన్ టెస్ట్ (PVT) యూనిట్ ఫొటోలను కూడా షేర్ చేసింది. రీడిజైన్ చేసిన బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. పీవీటీ యూనిట్లు సాధారణంగా ఉత్పత్తి ప్రక్రియలో పరిమిత పరిమాణంలో తయారవుతాయి. యాక్టివిటీలు, హార్డ్‌వేర్ భాగాలు, క్వాలిటీ ప్రమాణాలకు కట్టుబడి ఉంటాయి.

Nothing Phone 2a launch timeline, price, specs and other details tipped

Nothing Phone 2a launch  

డిజైన్ విషయానికొస్తే.. లీకైన ఫొటోల ప్రకారం.. నథింగ్ ఫోన్ 2ఎ ముందు భాగంలో సాధారణ పంచ్-హోల్ నాచ్ డిస్‌ప్లేను ప్రదర్శిస్తాయి. దీనికి విరుద్ధంగా, బ్యాక్ ప్యానెల్ నథింగ్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరి డిజైన్ ఉండనుంది. కెమెరా మాడ్యూల్‌తో డిజైన్ కలిగి ఉండనుంది. ఓవర్‌హాల్ బ్యాక్ ప్యానెల్‌ను నథింగ్ ఫోన్ 2ఎ రీడిజైన్ చేసిన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను చూడవచ్చునని టిప్‌స్టర్ పేర్కొన్నారు. ఈ రీడిజైన్ ఇంటర్‌ఫేస్ నథింగ్ ఫోన్ (2)లో ఫీచర్ సమానమైన గ్లిఫ్ కంట్రోల్ అందిస్తుంది.

రాబోయే నథింగ్ ఫోన్ 2ఎ మోడల్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ సపోర్టుతో ఓఎల్ఈడీ స్క్రీన్‌ను అందించనుంది. భారత మార్కెట్లో అనేక మిడ్-రేంజ్ ఫోన్‌లలో ఇదే చూస్తున్నాం. గత లీక్ ప్రకారం.. డివైజ్ 6.7-అంగుళాల ప్యానెల్‌ను కలిగి ఉండవచ్చని సూచించింది.

హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్ఓసీ చూడవచ్చు. సాధారణ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో బ్యాకప్ అందించవచ్చు. ఈ కొత్త ఫోన్ 2ఎ స్మార్ట్‌ఫోన్‌తో సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌ని అందించడం లేదు. బ్యాక్ కెమెరా సిస్టమ్‌లో రెండు సెన్సార్‌లు ఉన్నాయి. అందులో ఒకటి 50ఎంపీ కెమెరా ఉండవచ్చు.

Read Also : Apple iPhone 16 Series : వీడియోల కోసం రాబోయే ఆపిల్ ఐఫోన్ 16లో స్పెషల్ బటన్.. ఇదేలా పనిచేస్తుందంటే?