Hero Vida V1 e-scooter : 2023 ఇయర్ ఎండ్ సేల్.. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుపై ఎంత ఆదా చేసుకోవచ్చుంటే?

Hero Vida V1 e-scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 2023 ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే ఈవీ స్కూటర్లను సొంతం చేసుకోవచ్చు. హీరో విడా వి1 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.

Hero Vida V1 e-scooter : 2023 ఇయర్ ఎండ్ సేల్.. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుపై ఎంత ఆదా చేసుకోవచ్చుంటే?

Big year-end discounts on Hero Vida V1 electric scooter

Hero Vida V1 e-scooter : ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ విడా V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. 2023 ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్, విడా, విడా V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సంవత్సరాంతపు తగ్గింపులను అందిస్తోంది. ఈ డిస్కౌంట్లలో ముందస్తు డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీ, తక్కువ వడ్డీ రేట్లు, జీరో ప్రాసెసింగ్ ఫీజులు, రూ. 2,429తో ప్రారంభమయ్యే ఈఎంఐలు ఉన్నాయి.

Read Also : Vivo X100 Series India : భారత్‌కు వివో X100 సిరీస్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు ఇవే.. ధర ఎంత ఉండొచ్చుంటే?

విడా ఫైనాన్సింగ్ కోసం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో భాగస్వామ్యం కలిగి ఉంది. విడా V1 ప్లస్ ఈవీ స్కూటర్ 3.44kWh బ్యాటరీని కలిగి ఉంది. విడా ఎలక్ట్రిక్ స్కూటర్ క్లెయిమ్ పరిధి 143కి.మీ అందిస్తుంది. నవంబర్‌లో 57శాతం వృద్ధితో హీరో విడా అధిక సంఖ్యలో విక్రయిస్తోంది.

విడా వి1 కొనుగోలుపై రూ. 31వేల వరకు తగ్గింపు :
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై రూ. 31వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ మొత్తంలో మోడల్ స్టిక్కర్ ధరపై రూ. 6,500 ముందస్తు తగ్గింపు, రూ. 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 7,500 లాయల్టీ బోనస్ ఉన్నాయి. అంతేకాకుండా, కంపెనీ రూ. 2,500 కార్పొరేట్ తగ్గింపు, రూ. 1,125 విలువైన కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, రూ. 8,259 విలువైన ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీని అందిస్తోంది.

Big year-end discounts on Hero Vida V1 electric scooter

Hero Vida V1 electric scooter

అంతేకాకుండా, విడా వి1 ఫైనాన్సింగ్ కోరుకునే కస్టమర్లకు 5.99శాతం తక్కువ వడ్డీ రేట్లు, లోన్‌లపై జీరో ప్రాసెసింగ్ ఫీజులు, రూ. 2,429 నుంచి ఈఎంఐ వంటి ఫైనాన్స్ ఆప్షన్ల నుంచి ప్రయోజనం పొందవచ్చు. విడా వి1 ఈవీ స్కూటర్ హీరో ఫైనాన్స్ కార్పొరేషన్, ఐడీఎఫ్‌‌సీ, ఈకోఫై వంటి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది.

వి1 ఈ-స్కూటర్ టాప్ స్పీడ్ ఎంతంటే? :
విడా వి1 ప్లస్ 3.44కెడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఉపయోగిస్తుంది. తద్వారా 143కి.మీ పరిధిని అందిస్తుంది. పోల్చి చూస్తే.. వి1 ప్రోలో పెద్ద 3.94kWh బ్యాటరీ కలిగి ఉంది. 165కి.మీల అధిక క్లెయిమ్ పరిధిని అందిస్తుంది. రెండు వేరియంట్‌లు ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో వస్తాయి. 6కెడబ్ల్యూ పీక్ పవర్, వి1 ఈ-స్కూటర్‌ను గరిష్ట స్పీడ్ గంటకు 80కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

దేశంలో ద్విచక్ర వాహన రంగంలో లెగసీ బ్రాండ్ అయిన హీరో విడా మోడల్ అమ్మకాలతో తిరిగి పుంజుకుంది. ఇటీవలి కాలంలో ఆకట్టుకునే అమ్మకాలను సాధించింది. నవంబర్‌లో విడా మోడల్ 3,030 యూనిట్లను విక్రయించింది. తద్వారా గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 1,935 యూనిట్లతో పోలిస్తే.. 57 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Read Also : Aadhaar Address Update : మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా అప్‌‌డేట్ చేసుకోవాలో తెలుసా? పూర్తి ప్రాసెస్ మీకోసం..!