Ola Electric Sales : ఓలా ఎలక్ట్రిక్ రికార్డు విక్రయాలు.. ఏప్రిల్‌లో 30వేలకు పైగా యూనిట్లు.. 40శాతం వాటా కైవసం..!
Ola Electric Sales : ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రానిక్ (Ola Electric) దూసుకెళ్తోంది. భారత మార్కెట్లో ఒక్క ఏప్రిల్‌లోనే 30వేల స్కూటర్లను విక్రయించి మరో రికార్డును క్రియేట్ చేసింది. తద్వారా మార్కెట్లో 40శాతం వాటాను కైవసం చేసుకుంది.

Ola clocks in sales of over 30K units in April, wrests 40 percent market share
Ola Electric Sales : భారత అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మరో రికార్డును నెలకొల్పింది. ఏప్రిల్ 2023లో విక్రయాల గణాంకాలను అధికారికంగా ప్రకటించింది. ఈవీ (EV) స్కూటర్ మార్కెట్లో 40శాతం వాటాను ఓలా కైవసం చేసుకుంది. ఏప్రిల్‌లో 30వేల యూనిట్లకు పైగా విక్రయించి అత్యధిక నెలవారీ విక్రయాలను సాధించింది. వరుసగా 8 నెలల పాటు అమ్మకాల పట్టికలో ఓలా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మొత్తంగా 2023 ఆర్థిక సంవత్సరంలో ఓలా స్కూటర్ విక్రయాల్లో ఏకంగా 40శాతం వాటాను అధిగమించి టాప్ ప్లేసులో నిలిచింది.
ప్రస్తుత రోజుల్లో కస్టమర్లు ఎక్కువగా ప్రపంచ స్థాయి EV ప్రొడక్టులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈవీ వాహనాలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ఓలా సేల్స్ మరింత వేగవంతం చేసేందుకు మరిన్ని ఈవీ స్కూటర్లను మార్కెట్లోకి విస్తరిస్తున్నామని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ అన్నారు.
ఈ డిమాండ్‌ను తీర్చడానికి D2C నెట్‌వర్క్‌ను భారీగా పెంచే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను మరింత వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా అనేక ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను (ECలు) ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ఓలా ఆఫ్‌లైన్ స్టోర్లను విస్తరిస్తున్నట్టు చెప్పారు.

Ola Electric Sales : Ola clocks in sales of over 30K units in April, wrests 40 percent market share
దేశంలో 500వ ECని త్వరలో ప్రారంభించేందుకు రెడీగా ఉందన్నారు. ఆగస్టు నాటికి ఈ సంఖ్యను 1,000కి రెట్టింపు చేయాలని కంపెనీ భావిస్తోందని తెలిపారు. ఈ సెంటర్లను ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్‌కు 20 కి.మీ దూరంలో ఉండేలా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
ఓలా కస్టమర్లలో 90శాతం మంది వినియోగదారులకు సమీపంలో ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు అనేక సర్వీసులను అందించనున్నట్టు ఆయన తెలిపారు. నెలరోజులుగా ఓలా స్థిరమైన మార్కెట్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో 2025 నాటికి దేశంలోని అన్ని 2-వీలర్లను ఎలక్ట్రిక్‌గా మార్చాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తోందని ఓలా చీఫ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.
Read Also : Top 10 Selling Cars 2023 : ఏప్రిల్ 2023లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు ఇవే.. ఫుల్ లిస్టు ఇదిగో..!