20శాతం ఉద్యోగుల్ని తొలగిస్తున్న Ola

20శాతం ఉద్యోగుల్ని తొలగిస్తున్న Ola

Updated On : November 29, 2019 / 7:38 AM IST

ఓలా ఉద్యోగుల్ని తీసేయాలని నిర్ణయించుకుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) కింద 15-20శాతం మందిని విధుల్లోంచి తొలగించేస్తోంది. రెండు గ్రూపులుగా సేవలందిస్తున్న ఓలా 6వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ, ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ లలో ఇప్పటికే 8-10శాతం మందిని ఉద్యోగాల్లోంచి తప్పించి మళ్లీ తీసుకుంది. 

అభివృద్ధి, లాభాలు మెరుగుపరిచేందుకు సంస్థ రూపురేకలు మారుస్తున్నారు. ఈ మేర తీసుకోనున్న నిర్ణయాలు అన్ని ఓలా బ్రాంచులకు త్వరితగతిన వర్తిస్తాయి. సంస్థాగతమైన డిజైన్ ను మార్చడానికి తీసుకునే నిర్ణయాలు ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని, వ్యాపారంలో లావాదేవీలను పెంచుతుంది. ఈ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నట్లు ఓలా అధికార ప్రతినిధి వెల్లడించారు. 

ఓలా సంస్థ 2019ఆర్థిక సంవత్సరంలో రూ. వెయ్యి 160కోట్ల నష్టాన్ని, 2018ఆర్థిక సంవత్సరంలో 2వేల 676కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఒకవేళ ఉద్యోగుల్ని తొలగిస్తే రూ.1వెయ్యి 885కోట్ల లాభాలు వస్తాయని నిపుణుల అంచనా. పెట్టుబడిదారుల ఒత్తిడి కారణంగానే ఓలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు వెల్లడించింది ఓలా.