Oppo F27 Series Launch : ఒప్పో F27 సిరీస్ ఫోన్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. భారత్‌కు రాబోయే ఫస్ట్ IP69-రేటెడ్ ఫోన్‌..!

Oppo F27 Series Launch : లీకైన పోస్టర్‌లోని స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఒప్పో F27 ప్రో ప్లస్ గత నెలలో చైనాలో లాంచ్ అయిన మరో స్మార్ట్‌ఫోన్. ఒప్పో ఎ3 ప్రో మాదిరిగానే ఉంటుందని సూచిస్తుంది.

Oppo F27 Series Launch : ఒప్పో F27 సిరీస్ ఫోన్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. భారత్‌కు రాబోయే ఫస్ట్ IP69-రేటెడ్ ఫోన్‌..!

Oppo F27 Series India Launch Date Leaked ( Image Credit : Google )

Oppo F27 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి సరికొత్త ఒప్పో ఎఫ్27 సిరీస్ ఈ నెలాఖరులో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. టిప్‌స్టర్ లీక్ పోస్టర్ ప్రకారం.. ఈ సిరీస్‌లో 3 హ్యాండ్‌సెట్‌లు వచ్చే అవకాశం ఉంది. ఒప్పో ఎఫ్27, ఒప్పో F27 ప్రో, ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. రాబోయే ఒప్పో F27 ప్రో భారత్‌లో నీటి నిరోధకతకు ఐపీ69 రేటింగ్‌తో రానున్న మొదటి స్మార్ట్‌ఫోన్ కానుంది. ఒప్పో ప్రో మోడల్‌లలో ఒకటైన చైనాలో కంపెనీ ఇటీవల ఆవిష్కరించిన మరో స్మార్ట్‌ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా రావచ్చు.

Read Also : Vivo Watch GT Launch : 21 రోజుల బ్యాటరీ లైఫ్, ఇసిమ్ సపోర్ట్‌తో వివో జీటీ స్మార్ట్‌వాచ్.. ధర, స్పెసిఫికేషన్‌లు ఇవే

ఒప్పో F27 సిరీస్ ఇండియా లాంచ్ డేట్ లీక్ :
టిప్‌స్టర్ ముకుల్ శర్మ (గతంలో ట్విట్టర్)లో భారత్‌లో ఒప్పో F27 సిరీస్ లాంచ్ కోసం పోస్టర్‌ను లీక్ చేశారు. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ జూన్ 13న భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని పోస్టర్ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఒప్పో ఎఫ్27 ప్రో, ప్రామాణిక ఒప్పో ఎఫ్27 మోడల్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. టిప్‌స్టర్ పోస్ట్ ప్రకారం.. డస్ట్, నీటి నిరోధకతకు సిరీస్‌లోని కనీసం ఒక స్మార్ట్‌ఫోన్ ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను కలిగి ఉంటుంది. ఈ నెలాఖరులో కంపెనీ లాంచ్ కాబోయే హ్యాండ్‌సెట్‌కు మల్టీ ఐపీ రేటింగ్‌లపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఒప్పో F27 ప్రో ప్లస్ రీబ్రాండెడ్ ఒప్పో A3 ప్రోగా రావచ్చు :
లీకైన పోస్టర్‌లోని స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఒప్పో F27 ప్రో ప్లస్ గత నెలలో చైనాలో లాంచ్ అయిన మరో స్మార్ట్‌ఫోన్. ఒప్పో ఎ3 ప్రో మాదిరిగానే ఉంటుందని సూచిస్తుంది. ఇందులో బ్యాక్ ప్యానెల్ టాప్ మధ్యలో ఉన్న సర్కిల్ బ్యాక్ కెమెరా మాడ్యూల్, అలాగే పోస్టర్‌లో చూపిన రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. డిజైన్‌తో పాటు, ఒప్పో ఎ3 ప్రో కూడా చైనాలో ఐపీ69 రేటింగ్‌తో ప్రారంభించిన కంపెనీ మొదటి ఫోన్. ఒప్పో ఎ సిరీస్ ఫోన్‌కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా హ్యాండ్‌సెట్‌ను భారత మార్కెట్లో లాంచ్ కానుందని సూచిస్తుంది.

అయితే, ఒప్పో F27 ప్రో లేదా ఎఫ్27 ప్రో ప్లస్, ఒప్పో ఎ3 ప్రో గ్లోబల్ వేరియంట్ కాదా అనేది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. ఈ ఊహాగానాలు కచ్చితమైనవి అయితే.. ఒప్పో F27 ప్రో లేదా ఒప్పో F27 ప్రో ప్లస్ 12జీబీ వరకు ర్యామ్‌తో డైమెన్సిటీ 7050 చిప్‌తో అమర్చబడి ఉండవచ్చు. ఈ ఫోన్ 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 67డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.

Read Also : T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ మ్యాచ్.. రేపటి నుంచే ప్రారంభం.. ఫ్రీగా మొబైల్, స్మార్ట్ టీవీలో వీక్షించాలంటే?