Credit Card Bill : మీ క్రెడిట్ కార్డ్ బిల్లును మరో కార్డుతో చెల్లించవచ్చా? ‘బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్’తో నష్టాలేంటి? ఇలా చేస్తే అప్పులపాలవుతారు..!
Credit Card Bill : క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అత్యవసర సమయాల్లో మాత్రమే.. అదేపనిగా చేస్తుంటే ఛార్జీలు, వడ్డీ రేట్ల భారం పడుతుంది.

Credit Card Bill
Credit Card Bill : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? మీ దగ్గర ఒకటికి మించి ఎక్కువ కార్డులు ఉన్నాయా? మీ క్రెడిట్ కార్డు బిల్లులను ఎలా చెల్లిస్తున్నారు. ఒక కార్డులో (Credit Card Bill) నుంచి మరో కార్డుకు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. మీరు క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టేందుకు ఒక కార్డుతో మరో కార్డును చెల్లించకూడదు.
ఇలా చేయడం ప్రస్తుతం మీ సమస్య తీరుతుంది. కానీ, అదే పనిగా చేస్తుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది ఆర్థిక సంక్షోభం లేదా క్రెడిట్ కార్డు పేమెంట్ గడువు తేదీలు దగ్గరపడినప్పుడు ఇలా చేస్తుంటారు.
ఈ విధానం కొంతవరకు రిలీఫ్ కలిగించవచ్చు. కొన్ని మీకు కనిపించని ఛార్జీలు, అధిక వడ్డీ రేట్లతో మీ క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మీరు బకాయిలను క్లియర్ చేసేందుకు ఇతర క్రెడిట్ కార్డులపై ఆధారపడటం కొనసాగిస్తే త్వరలోనే అప్పుల ఉచ్చులో చిక్కుకుంటారు జాగ్రత్త..
మరో విషయం ఏమిటంటే.. ఒక క్రెడిట్ కార్డుతో మరో క్రెడిట్ కార్డుకు చెల్లించడం అంత సులభం కాదు. సాధారణంగా మరో కార్డును ఉపయోగించి నేరుగా క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించలేరు. అయితే, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లేదా క్రెడిట్ కార్డ్ లోన్ లేదా క్యాష్ అడ్వాన్స్ వంటి పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల్లో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి.
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ :
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఒక క్రెడిట్ కార్డ్ నుంచి మరో క్రెడిట్ కార్డ్‌కు బకాయి ఉన్న బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సాధారణంగా తక్కువ వడ్డీ రేటు లేదా సున్నా వడ్డీని అందించే క్రెడిట్ కార్డ్‌కు మార్చుకోవచ్చు. ఇలా చేసే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
చాలా బ్యాంకులు లిమిటెడ్ టైమ్ వరకు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సున్నా వడ్డీకి అందిస్తాయి. మీరు ఆ విండోలోపు మొత్తాన్ని తిరిగి చెల్లించగలగాలి. తద్వారా మీరు వడ్డీపై భారీగా ఆదా చేయవచ్చు. అయితే, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ప్రాసెసింగ్ ఫీజులతో ఉంటాయి. ఫ్రీ టైమ్ పీరియడ్ తిరిగి చెల్లించడంలో విఫలమైతే అధిక మొత్తంలో వడ్డీ ఛార్జీలు భరించాల్సి రావచ్చు.
క్యాష్ అడ్వాన్సు తీసుకోవచ్చా? :
చాలామంది క్రెడిట్ కార్డు నుంచి క్యాష్ విత్‌డ్రా చేసి.. ఆ మొత్తాన్ని మరో కార్డులో కార్డు బిల్లులను చెల్లిస్తుంటారు. ఇలా ఎప్పుడూ చేయొద్దు. వెరీ డేంజరస్.. ఎందుకంటే.. క్యాష్ అడ్వాన్సులు మొదటి రోజు నుంచి అధిక వడ్డీ రేట్లతో పాటు అదనపు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ లేని వ్యవధి ఉండదు. అదే అలవాటు చేస్తుంటే అది తీవ్ర అప్పలకు దారితీస్తుంది.
మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుందా? :
మీరు ఏదైనా క్రెడిట్ కార్డును బాధ్యతాయుతంగా వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందులోనూ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్ పడదు. వాస్తవానికి.. అధిక వడ్డీ రుణాన్ని తగ్గించేందుకు చేస్తే మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి మెరుగుపడుతుంది.
కానీ, అదేపనిగా కార్డు నుంచి కార్డు బ్యాలెన్స్‌లను ట్రాన్స్‌ఫర్ చేస్తుంటే మాత్రం రుణదాతలకు ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఒక క్రెడిట్ కార్డుతో మరొక క్రెడిట్ కార్డుకు బిల్లు చెల్లించడం తాత్కాలిక రిలీఫ్ మాత్రమే ఉంటుంది. అంతేకానీ అదో అలవాటుగా మారకూడదని గుర్తుంచుకోవాలి.
క్రెడిట్ లోన్లపై వడ్డీ తగ్గించుకోవడానికి క్రెడిట్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, ప్రత్యేకించి క్రెడిట్ బిల్లులను క్లియర్ చేసేందుకు క్యాష్ అడ్వాన్సులు లేదా మల్టీ కార్డులను అసలు వాడొద్దు. ఈ క్రెడిట్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సదుపాయాన్ని ఉపయోగించే ముందు ఫైన్ ప్రింట్ చదవాలి. ఫీజులు, వడ్డీ రేట్లు, ఇతర అంశాలను అంచనా వేసిన తర్వాత మాత్రమే ఇలా చేస్తుండాలి. లేదంటే మీరు అప్పుల ఉచ్చులో చిక్కుకుంటారు.