Paytm Gold Coins : పండగ చేస్కోండి.. పేటీఎంలో కొత్త ఫీచర్.. ఇక ప్రతి పేమెంట్‌పై గోల్డ్ కాయిన్స్ పొందొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

Paytm Gold Coins : పేటీఎం యూజర్లు ఇక ప్రతి పేమెంట్‌పై గోల్డ్ కాయిన్స్ గెలుచుకోవచ్చు. పేటీఎం సరికొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?

1/6Paytm Gold Coins
Paytm Gold Coins : పీటీఎం యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఇకపై పేటీఎం ద్వారా చేసే ప్రతి లావాదేవీపై గోల్డ్ కాయిన్స్ లభిస్తాయి. పేటీఎం వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ప్రతి లావాదేవీపై గోల్డ్ కాయిన్స్ పొందుతారు. ఈ కాయిన్స్ డిజిటల్ బంగారంగా మార్చవచ్చని పేటీఎం తెలిపింది. ఈ సౌకర్యం అనేక రకాల లావాదేవీలపై వర్తిస్తుంది.
2/6Paytm Gold Coins
స్కాన్, పే, ఆన్‌లైన్ షాపింగ్, మనీ ట్రాన్స్‌ఫర్, రీఛార్జ్, బిల్లు పేమెంట్, రీపేమెంట్స్ మొదలైన లావాదేవీలపై గోల్డ్ కాయిన్స్ పొందవచ్చు. పేటీఎం వినియోగదారులు యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్లు చేసినా కూడా గోల్డ్ కాయిన్స్ లభిస్తాయి.
3/6Paytm Gold Coins
ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.. క్రెడిట్ కార్డ్, రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే యూపీఐ పేమెంట్లపై కూడా డబుల్ గోల్డ్ కాయిన్స్ సొంతం చేసుకోవచ్చు.
4/6Paytm Gold Coins
గోల్డ్ కాయిన్స్ ఎలా పొందాలి? : ప్రతి లావాదేవీకి వినియోగదారులు లావాదేవీ మొత్తంలో ఒక శాతం గోల్డ్ కాయిన్స్ రూపంలో పొందుతారని కంపెనీ పేర్కొంది. ఉదాహరణకు.. రూ. 10వేలు ఖర్చు చేయడం ద్వారా 100 గోల్డ్ కాయిన్స్ లభిస్తాయి. రూ. 1.5 లక్షలు ఖర్చు చేయడం ద్వారా 1,500 గోల్డ్ కాయిన్స్ లభిస్తాయి. ఒక్కొక్కటి సుమారు రూ. 15 విలువైనవి. ముఖ్యంగా, 0.01శాతం క్యాష్‌బ్యాక్‌కు సమానం. కానీ, క్యాష్ కాకుండా డిజిటల్ గోల్డ్ రూపంలో ఉంటుంది.
5/6Paytm Gold Coins
ఈ ఫీచర్ ఎందుకంటే? : భారత మార్కెట్లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందులోనూ పండగ సీజన్‌లో చెప్పన్కర్లేదు. అందుకే పండుగ సీజన్‌కు ముందే ఈ ఫీచర్‌ను ప్రారంభించినట్లు పేటీఎం తెలిపింది. ఆసక్తిగల వినియోగదారులు క్రమంగా డిజిటల్ గోల్డ్ సేకరించి తమ ఖర్చులను సేవింగ్స్, దీర్ఘకాలిక పెట్టుబడులుగా మార్చుకోవచ్చు అనమాట.
6/6Paytm Gold Coins
ఇతర కొత్త ఫీచర్లు ఇవే : ఇటీవలే, పేటీఎం యాప్‌కు అనేక ఫీచర్లను యాడ్ చేసింది. అందులో తరచూ చేసే ఖర్చుల కోసం రిమైండర్‌లు, నెలవారీ ఖర్చు సమ్మరీ, కస్టమైజడ్ యూపీఐ ఐడీలు, UPI స్టేట్‌మెంట్‌ డౌన్‌లోడ్, అన్ని బ్యాంక్ అకౌంట్ల గురించి సమాచారాన్ని ఒకే చోట యాక్సస్ చేయొచ్చు. పేటీఎం యూజర్లు ఇప్పుడు ప్రతి ఖర్చుతో కొద్ది మొత్తంలో బంగారాన్ని సేకరించి ఆపై కాలక్రమేణా పెట్టుబడిగా మార్చుకోవచ్చు.