PM Awas Yojana 2025 : కొత్త ఇల్లు కొనేవారికి గుడ్ న్యూస్ .. ఈ ప్రభుత్వ పథకంతో రూ. 2.5 లక్షల ఆర్థిక సాయం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

PM Awas Yojana 2025 : పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా లక్షలాది కుటుంబాలు సొంత ఇల్లు కొనుగోలు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం రూ. 2.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.

PM Awas Yojana 2025 : కొత్త ఇల్లు కొనేవారికి గుడ్ న్యూస్ .. ఈ ప్రభుత్వ పథకంతో రూ. 2.5 లక్షల ఆర్థిక సాయం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

PM Awas Yojana 2025

Updated On : June 23, 2025 / 2:04 PM IST

PM Awas Yojana 2025 : సొంత ఇల్లు కల ప్రతిఒక్కరికి ఉంటుంది. కానీ, కొందరు మాత్రమే నిజం చేసుకోగలరు. అందులోనూ మిడిల్ క్లాసు వారికి సొంతిల్లు అంటే ప్రత్యేకించి (PM Awas Yojana 2025) చెప్పన్కర్లేదు. ప్రస్తుత రోజుల్లో కొత్త ఇల్లు కొనడం అంత ఈజీ కాదు. లోన్లు, ఈఎంఐ, రిజిస్ట్రేషన్ ఫీజులు, పన్నులు వంటి అంశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

ఇల్లు కొనే ముందు చాలామంది కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. లేదంటే అప్పుల ఊబిలో చిక్కుకుని తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇల్లు కొనలేని స్థితిలో ఉన్న చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం ఇలాంటి వారికి ఆర్థిక సాయం చేస్తుంటుంది.

భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఇలాంటి వారికి ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తుంది. మీరు కూడా కొత్త ఇల్లు కొనాలనుకుంటే.. ప్రభుత్వం నుంచి సబ్సిడీ ధరకే కొత్త ఇల్లును పొందవచ్చు. కొత్త ఇంటి కోసం రూ. 2.50 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు.

రూ. 2.50 లక్షల ప్రయోజనం ఎవరికంటే? :
భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), తక్కువ ఆదాయ వర్గాలు (LIG) వారికి ఆర్థిక సాయం అందిస్తుంది. ఇందుకోసం కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

1. ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS) :
మీరు ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారైతే మీ వార్షిక ఆదాయం రూ. 3 లక్షల వరకు ఉంటే.. 30 చదరపు మీటర్ల వరకు ఉన్న ఇంటికి రూ. 2.50 లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు. కొత్తగా ఇల్లు కొనాలని చూస్తున్న కుటుంబాలకు అద్భుతమైన అవకాశం.

2. లో-ఇన్‌కమ్ గ్రూపు (LIG)
మీరు తక్కువ ఆదాయ వర్గానికి చెందితే.. వార్షిక ఆదాయం రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 60 చదరపు మీటర్ల వరకు ఉన్న ఇళ్లపై సబ్సిడీ లభిస్తుంది. ఈ సబ్సిడీ ఇల్లు కొనుగోలు భారాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

3. మిడిల్ ఇన్‌కమ్ గ్రూపు (MIG) :

  • ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనలో మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ (MIG) కూడా భారీ ప్రయోజనాలను పొందవచ్చు.
  • MIG-I : మీ వార్షిక ఆదాయం రూ. 6 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉంటే.. వడ్డీపై 4శాతం సబ్సిడీ
  • MIG-II : మీ వార్షిక ఆదాయం రూ. 12 లక్షల నుంచి రూ. 18 లక్షల మధ్య ఉంటే.. వడ్డీపై 3శాతం సబ్సిడీ
  • ఈ సబ్సిడీ మీ గృహ రుణంలో ఈఎంఐ నేరుగా తగ్గిస్తుంది. ఇంటి ఖర్చు మరింత చౌకగా మారుతుంది.

పథకం ప్రయోజనాలేంటి? :
మీరు EWS, LIG కేటగిరీలోకి వస్తే.. రూ. 2.50 లక్షల సబ్సిడీని నేరుగా పొందవచ్చు. MIG కేటగిరీలకు వడ్డీలో తగ్గింపు ఉంటుంది. నెలవారీ ఈఎంఐల భారం తగ్గుతుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రయోజనాల కోసం నేరుగా PMAY అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు లేదా మీ సమీప బ్యాంకు నుంచి కూడా సమాచారాన్ని పొందవచ్చు. దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన డాక్యమెంట్ల గురించి బ్యాంకులు పూర్తి సమాచారాన్ని అందిస్తాయి.