PM Kisan : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 20వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2వేలు పడేది ఈ తేదీనే..? మీరు అర్హలేనా.. ఇలా చెక్ చేసుకోండి!

PM Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. రైతుల ఖాతాల్లో రూ. 2వేలు పడేది ఎప్పుడంటే?

PM Kisan : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 20వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2వేలు పడేది ఈ తేదీనే..? మీరు అర్హలేనా.. ఇలా చెక్ చేసుకోండి!

PM Kisan Scheme

Updated On : July 26, 2025 / 2:27 PM IST

PM Kisan 20th Installment : పీఎం కిసాన్ లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. 9 కోట్లకు పైగా రైతులు 20వ ప్రధానమంత్రి కిసాన్ వాయిదా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 2న వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమంలో 20వ విడత విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ వాయిదా పొందాలంటే రైతులకు అర్హత, డాక్యుమెంట్ల ధృవీకరణ తప్పనిసరి.

మీరు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan) కింద రిజిస్టర్ అయిన రైతు అయితే.. మీకు త్వరలోనే 20వ విడత రూ. 2వేలు ఖాతాల్లో పడవచ్చు. ఇప్పటివరకు, కేంద్ర ప్రభుత్వం రైతులకు 19 వాయిదాలను విడుదల చేసింది. ప్రతి 4 నెలలకు రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 2వేలు నేరుగా పంపుతోంది. చివరి విడత ఫిబ్రవరి 2025లో విడుదల అయిన సంగతి తెలిసిందే.

20వ విడత రూ. 2వేలు ఎప్పుడు వస్తాయి? :
దేశవ్యాప్తంగా లబ్ధిదారు రైతులు 20వ ప్రధానమంత్రి కిసాన్ వాయిదా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ, కేంద్రం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. మీడియా నివేదికల ప్రకారం.. వచ్చే ఆగస్టు 2న రూ. 2వేలు విడుదల చేసే అవకాశం ఉంది.

ఎందుకంటే.. ఈ తేదీన ఉత్తరప్రదేశ్‌కు రూ.1,000 కోట్ల ప్రాజెక్టులను ప్రకటించే కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిని సందర్శించనున్నారు. అదే రోజున పీఎం కిసాన్ 20వ విడుదల కూడా ఉండొచ్చునని భావిస్తున్నారు.

ఎవరికి ప్రయోజనం లభిస్తుందంటే? :
రైతులందరూ 20వ విడత పొందలేరు. అవసరమైన పనులను పూర్తి చేసినవారే అర్హులు.

  • e-KYC పూర్తి అయి ఉండాలి.
  • ల్యాండ్ వెరిఫికేషన్ కలిగి ఉండాలి.
  • బ్యాంకు అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.
  • ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) సర్వీసు యాక్టివ్
  • ఇందులో ఏదైనా పూర్తి చేయకపోతే రైతులకు రావాల్సిన వాయిదా ఆలస్యం కావచ్చు. లేదంటే అసలు అందకపోవచ్చు.

మీ వాయిదా ఎందుకు ఆలస్యమంటే? :

Read Also : Google Pixel 10 Series : కొత్త గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ వచ్చేస్తోంది.. మొత్తం 4 ఫోన్లు.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే..?

  • వాయిదా ఆలస్యం అయ్యేందుకు కొన్ని సాధారణ కారణాలివే :
  • e-KYC పూర్తి కాకపోవడం.
  • భూమి రికార్డులు వెరిఫై చేయకపోవడం.
  • బ్యాంకు అకౌంట్ ఆధార్‌తో లింక్ చేయకపోవడం.
  • మీ ఖాతాలో DBT సౌకర్యం యాక్టివ్‌గా లేకపోవడం.
  • అన్ని డాక్యుమెంట్లు, వెరిఫికేషన్లు ముందుగానే పూర్తి కావాలి.

పీఎం కిసాన్ పథకం ఏంటి? :

  • రైతులకు ఆర్థికంగా మద్దతు కోసం ఈ పథకం 2019లో ప్రారంభమైంది.
  • ప్రతి ఏడాది రూ. 6వేలు ఇస్తారు.
  • రూ. 2వేలు 3 వాయిదాలలో చెల్లిస్తారు.
  • రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బు బదిలీ

మీ లబ్ధిదారుని స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :

  • మీ పేరు పీఎం కిసాన్ జాబితాలో ఉందో లేదో చెక్ చేయొచ్చు.
  • అధికారిక వెబ్‌సైట్‌ (pmkisan.gov.in)ను విజిట్ చేయండి.
  •  “Know Your Status”పై క్లిక్ చేయండి.
  •  మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

ఈసారి ఆలస్యం ఎందుకంటే? :
సాధారణంగా, ప్రతి 4 నెలలకు ఒకసారి పీఎం కిసాన్ వాయిదా చెల్లిస్తారు. 19వ వాయిదా ఫిబ్రవరిలో వచ్చింది. 20వ విడత జూన్‌లో వస్తుందని భావించారు. కానీ, జూలై ముగిసినా ఇంకా విడత విడుదల కాలేదు. ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు 2పైనే పడింది. అధికారిక ప్రకటన వచ్చేవరకు రైతులు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోండి.