PM Kisan : పీఎం కిసాన్ 20వ విడతపై బిగ్ అప్‌డేట్.. ఈ అర్హతలు కలిగిన రైతులకే రూ. 2వేలు అందుకుంటారు.. ఇప్పుడే ఇలా చేయండి..!

PM Kisan : పీఎం కిసాన్ యోజన 20వ విడత ఆలస్యంగా అందనుంది. జూలై 2025లో అందే అవకాశం ఉంది. అర్హత కలిగిన రైతులకు మాత్రమే రూ. 2వేలు అందుతుంది.

PM Kisan : పీఎం కిసాన్ 20వ విడతపై బిగ్ అప్‌డేట్.. ఈ అర్హతలు కలిగిన రైతులకే రూ. 2వేలు అందుకుంటారు.. ఇప్పుడే ఇలా చేయండి..!

PM Kisan 20th Installment

Updated On : July 16, 2025 / 5:08 PM IST

PM Kisan 20th Installment Update : ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) కింద 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. దేశవ్యాప్తంగా లబ్ధిదారు రైతులు రూ. 2వేల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మునుపటి 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదలైంది.

ఈసారి జూలైలో రావాల్సిన 20వ విడత రూ.2వేలు చెల్లింపు ఆలస్యం అయింది. గత ఏడాదిలో జూన్ ఆఖరుకు ముందుగానే విడత విడుదల అయింది. అయితే, ఇప్పుడు నిర్దిష్ట అర్హత ప్రమాణాలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసిన రైతులకు మాత్రమే 20వ విడత అందనుంది. రూ. 2వేలు అకౌంటులో పడాలంటే రైతులు ఏయే పనులు ముందుగా పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పీఎం కిసాన్ 20వ వాయిదా అర్హతలివే :
పీఎం కిసాన్ పథకం కింద రైతులు ప్రయోజనాలను పొందాలంటే..

  •  భారతీయ పౌరుడిగా ఉండాలి.
  •  సొంత సాగు వ్యవసాయ భూమి
  •  చిన్న లేదా సన్నకారు రైతుగా ఉండాలి.
  •  నెలకు రూ. 10వేలకు పైగా పెన్షన్ ఉండకూడదు.
  •  ఆదాయపు పన్ను చెల్లించేవారు కాకూడదు.
  •  సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు.

20వ వాయిదా పొందాలంటే ఈ పనులు పూర్తి చేయాలి PM Kisan :

Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. ఈ నెల 18నే 20వ విడత విడుదల?.. రూ. 2వేలు పడాలంటే ఇప్పుడే ఈ పని చేయండి..!

  • అర్హత కలిగిన రైతులు 20వ విడత కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
  • ఫుల్ e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) పూర్తి చేసి ఉండాలి.
  • e-KYC లేకుండా వాయిదాలు పొందలేరు.
  • రైతులు అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/) లేదా సమీపంలోని CSC సెంటర్ల ద్వారా పూర్తి చేయాలి.
  • బ్యాంకు అకౌంటును ఆధార్ లింక్ చేయండి.
  • ఆధార్‌తో లింక్ చేయని బ్యాంక్ అకౌంట్ల కారణంగా డేటా మ్యాచ్ కాదు..
  • ఫలితంగా వాయిదాలు నిలిచిపోవచ్చు.

బ్యాంక్ అకౌంట్ వివరాలను వెరిఫై చేసుకోండి PM Kisan :

  • రాంగ్ IFSC కోడ్ లేదా అకౌంట్ నంబర్ ద్వారా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వొచ్చు.
  • రైతులు తమ అకౌంట్ వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసి సరిదిద్దుకోవాలి.
  • భూమి రికార్డు సమస్యలను వెంటనే పరిష్కరించండి.
  • అధికారిక రికార్డులలో భూమి యాజమాన్యాన్ని డిజిటల్‌గా వెరిఫై చేయాలి.
  • ఏవైనా తప్పులుంటే అర్హత కోల్పోతారు.
  • లబ్ధిదారుడి స్టేటస్ చెక్ చేయండి.
  • ప్రస్తుత లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అధికారిక వెబ్‌సైట్లో చెక్ చేసుకోండి.
  • OTP, నోటిఫికేషన్ల కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోండి.