Poco X6 Series Launch : పోకో x6 సిరీస్ ఫోన్ వచ్చేసిందోచ్.. టాప్ ఫీచర్లు అదుర్స్, భారత్‌లో ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!
Poco X6 Series Launch : పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 64ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Poco X6 and X6 Pro launched in India
Poco X6 Series Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ పోకో నుంచి కొత్త ఎక్స్6 సిరీస్ ఫోన్ వచ్చేసింది. ఈరోజు (జనవరి 11న) భారత మార్కెట్లో పోకో కొత్త ఫోన్ పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్‌లలో హైలైట్ ఏమిటంటే.. కొత్త మీడియాటెక్ డైమన్షిటీ 8300-అల్ట్రా ఎస్ఓసీ, 16జీబీ ర్యామ్ వరకు, 1టీబీ స్టోరేజీ వరకు, 5,500ఎంఎహెచ్ బ్యాటరీ వరకు, 64ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. భారత మార్కెట్లో పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల వేరియంట్లు ధరలు ఎలా ఉన్నాయంటే..
పోకో ఎక్స్6 సిరీస్ : భారత్ ధర ఎంతంటే? :
పోకో ఎక్స్6 మొత్తం మూడు వేరియంట్లలో వస్తుంది..
- 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ : రూ. 19,999
- 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ : రూ. 21,999
- 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజీ : రూ. 22,999
పోకో ఎక్స్6 ప్రో రెండు వేరియంట్లలో వస్తుంది :
- 8జీబీ ర్యామ్ + 256టీబీ స్టోరేజీ : రూ. 24,999
- 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజీ : రూ. 26,999
పోకో ఎక్స్6 ఫోన్ ధరలో అనేక బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. కస్టమర్‌లు ఐసీఐసీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేస్తే.. రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. వినియోగదారులు ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 2వేల వరకు తగ్గింపును కూడా పొందవచ్చు.
పోకో ఎక్స్6 సిరీస్ స్పెసిఫికేషన్‌లు :
పోకో ఎక్స్6 మోడల్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది. గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. క్వాల్‌కామ్ స్పాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం 3 వేరియంట్‌లలో వస్తుంది. బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీని కలిగి ఉంది. మిడ్ వేరియంట్ 12జీబీ ర్యామ్, 256 స్టోరేజీని కలిగి ఉంది.
అత్యధిక వేరియంట్ 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌కు ఇంధనంగా 5,100ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. బాక్స్‌లో వచ్చే 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్‌తో సపోర్టు ఇస్తుంది. పోకో ఎక్స్6 ప్రో ఐపీ54 ధృవీకరణను కలిగి ఉంది. అంటే.. ఇది దుమ్ము, నీటి స్ప్లాష్‌ల నుంచి పరిమిత రక్షణ అందిస్తుంది.

Poco X6 and X6 Pro launched in India
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. పోకో ఎక్స్6 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఓఐఎస్, ఈఐఎస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండింటినీ కలిగిన ఎఫ్/1.79 ఎపర్చర్‌తో 64ఎంపీ ప్రధాన సెన్సార్ ఉంటుంది. దానితో పాటు, ఎఫ్/2.2 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్‌ని ఉపయోగిస్తుంది. సెల్ఫీలకు పోకో ఎక్స్6 ఫోన్ ఫ్రంట్ సైడ్ 16ఎంపీ కెమెరాను కలిగి ఉంది.
పోకో ఎక్స్6 ప్రో విషయానికొస్తే.. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1.5కె రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300-అల్ట్రా ఎస్ఓసీ కలిగి ఉంది. 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వరకు స్పోర్ట్ చేసే రెండు వేరియంట్లలో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000ఎంహెచ్ బ్యాటరీని 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని ఉపయోగిస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. పోకో ఎక్స్6 ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఓఐఎస్, ఈఐఎస్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో ఎఫ్/1.79 ఎపర్చర్‌తో 64ఎంపీ ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంటుంది. కెమెరా మాడ్యూల్‌లో ఎఫ్/2.2 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలకు పోకో ఎక్స్6 ముందు భాగంలో 16ఎంపీ కెమెరాను కలిగి ఉంది. పోకో ఎక్స్6 ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఎంఐయూఐ 14పై రన్ అవుతుంది. భారత మార్కెట్లో హైపర్‌ఓఎస్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వచ్చిన ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ పోకో ఎక్స్6 ప్రో మాత్రమే.
పోకో ఎక్స్6 సిరీస్: ముఖ్య ఫీచర్లు ఇవే :
పోకో ఎక్స్6 ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300-అల్ట్రా ఎస్ఓసీ, 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ప్రత్యేకించి రూ. 19,999 నుంచి ధర ప్రారంభమవుతుంది. మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు పోకో ఎక్స్6 సిరీస్ డిస్‌ప్లే ఆకర్షణీయంగా ఉంటుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లే ప్రకాశవంతమైన రంగులతో ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

Poco X6 and X6 Pro
పోకో ఎక్స్6 ప్రో మరో హైలైట్ హైపర్ ఓఎస్. భారత మార్కెట్లో కొత్త షావోమీ ఓఎస్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. హైపర్ఓఎస్ అనేది షావోమీ గ్రాండ్ విజన్‌లో భాగం. అన్ని డివైజ్‌ల కోసం ఐఓఎస్-వంటి సాధారణ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. హైపర్‌ఓఎస్ గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ పైన ఉంటుంది. ఈ ఓఎస్ ఇప్పటికే భారత మార్కెట్లో అన్ని స్మార్ట్‌ఫోన్‌లతో అందుబాటులోకి వచ్చింది.
పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో రెండూ 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో 64ఎంపీ ప్రధాన సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్‌ను కలిగి ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. పోకో ఎక్స్6 ముందు భాగంలో 16ఎంపీ కెమెరాను కలిగి ఉంది. పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు రెండూ బెస్ట్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇందులోని సెల్ఫీ కెమెరా ఆకర్షణీయమైన ఫొటోలను కూడా క్యాప్చర్ చేస్తుంది.