Pure ecoDryft 350 : అత్యంత పొడవైన ప్యూర్ ఎకోడ్రైప్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్‌తో 171కి.మీ వేగంతో దూసుకెళ్లగలదు!

Pure ecoDryft 350 : కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. 171 కిలోమీటర్ల రేంజ్‌తో ప్యూర్ ఎకోడ్రైప్ట్ 350 మోడల్ ఈవీ మోటార్‌సైకిల్ లాంచ్ అయింది. ధర ఎంతంటే?

Pure ecoDryft 350 : అత్యంత పొడవైన ప్యూర్ ఎకోడ్రైప్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్‌తో 171కి.మీ వేగంతో దూసుకెళ్లగలదు!

Pure ecoDryft 350 electric motorcycle launched with 171 km range

Pure ecoDryft 350 : కొత్త ప్యూయర్ ఈవీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వేరియంట్ (ecoDryft 350)ని భారతీయ మార్కెట్లో రూ. 1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఆసక్తిగల కస్టమర్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ప్యూర్ ఈవీ అధీకృత డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు. 171 కిమీ ఛార్జ్‌తో ప్యూర్ ఎకోడ్రైఫ్ట్ 350 బైక్ 110సీసీ కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యంత పొడవైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అని కంపెనీ తెలిపింది. ఐసీఈ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లతో పోల్చితే.. ఎకోడ్రైప్ట్ 350 ఇ-మోటార్‌సైకిల్ నెలవారీ రూ. 7వేలు అంతకంటే ఎక్కువ ఆదా చేస్తుందని ప్యూర్ ఈవీ కంపెనీ పేర్కొంది.

ప్యూర్ ఎకోడ్రైఫ్ట్ 350 బ్యాటరీ పరిధి :

ప్యూర్ ఎకోడ్రైఫ్ట్ 350 మోటార్‌సైకిల్ 3.5కిలోవాట్స్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఆరు ఎంసీయూలతో 4హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో 40ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు.. ఈ బైక్ మొత్తం మూడు వేర్వేరు మోడ్‌లలో లభిస్తుంది.

Read Also : OpenAI Employees Protest : సామ్ ఆల్ట్‌మన్‌ను తిరిగి తీసుకోండి.. లేదంటే మేమంతా వెళ్లిపోతాం : ఓపెన్ఏఐకి ఉద్యోగుల అల్టిమేటం!

ప్యూర్ ఎకోడ్రైఫ్ట్ 350 ఫీచర్లు ఇవే :
ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రివర్స్ మోడ్, కోస్టింగ్ రీజెన్, హిల్-స్టార్ట్ అసిస్ట్ టు డౌన్-హిల్ అసిస్ట్, పార్కింగ్ అసిస్ట్ వంటి అనేక రకాల ఫీచర్లను పొందుతుంది. స్టేట్ ఆఫ్ ఛార్జ్ (SoC), స్టేట్ ఆఫ్ హెల్త్ (ఎస్ఓహెచ్) ప్రకారం.. బ్యాటరీ లైఫ్ నిర్ధారించడంలో వెహికల్ స్మార్ట్ ఏఐ టెక్నాలజీని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.

Pure ecoDryft 350 electric motorcycle launched with 171 km range

Pure ecoDryft 350 electric motorcycle

ప్యూర్ ఎకోడ్రైఫ్ట్ 350 పోటీదారులు :

ప్యూర్ ఈవీ హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ ప్లాటినా వంటి ఎంట్రీ-లెవల్ ఐసీఈ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇంకా, భారతీయ మార్కెట్లో హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లకు పోటీదారుగా నిలుస్తుంది. ప్యూర్ ఎకోడ్రైప్ట్ 350 బైక్ నెలకు రూ. 4వేల నుంచి సులభమైన ఈఎంఐ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. హీరోఫైన్ కార్పొరేషన్, ఎల్ అండ్ టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ మొదలైన వాటితో ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తూ, 100కి పైగా ప్రత్యేకమైన ప్యూర్ డీలర్‌షిప్‌ల వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Read Also : Tecno Spark Go 2024 : భారీ బ్యాటరీతో టెక్నో స్పార్క్ గో 2024 ఫోన్ ఇదిగో.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?