రైల్వే ప్రయాణికులకు శుభవార్త: లింక్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫీజులేదు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త: లింక్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫీజులేదు

Updated On : February 22, 2019 / 2:37 PM IST

ఎయిర్‌లైన్స్‌లో మాదిరిగానే రైల్వేలోనూ కొత్త సిస్టమ్‌ను తీసుకొచ్చింది ఇండియన్ రైల్వే. ఎవరైతే లింక్ టిక్కెట్లు తీసుకుని ప్రయాణిస్తారో వాళ్లు తమ లింక్డ్ టికెట్ క్యాన్సిల్ చేసుకునేందుకు ఎక్స్‌ట్రా ఫీజు ఏమీ ఉండదట. ప్రైమరీ ట్రైన్ లేట్ అయితేనే ఈ నియమం వర్తిస్తుంది. ముందు ఎక్కిన రైలు మూడు గంటలలోపు ఆలస్యమైతే ఈ క్యాన్సిలేషన్ సర్వీస్ వర్తిస్తుంది. ఈ సదుపాయాన్ని ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. 

ఉదహరణకు గుంటూరు నుంచి గోవా వెళ్లాలనుకుందాం. దానికి డైరక్ట్ ట్రైన్ లేదు. కచ్చితంగా కర్ణాటకలోని హుబ్లీలో దిగి మారాల్సిందే. ఇలా వెళ్లే క్రమంలో గుంటూరు నుంచి హుబ్లీకి వెళ్లాల్సిన రైలు కాస్త ఆలస్యంగా వెళ్లిందనుకుందాం. కానీ, అప్పటికే హుబ్లీ నుంచి గోవాకి వెళ్లాల్సిన రైలు బయల్దేరి వెళ్లిపోయింది. అప్పుడు మన టిక్కెట్ వృథా అయిపోతుందనే బాధ లేదు. కౌంటర్ దగ్గరకెళ్లి టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. మనం ఎంతైతే చెల్లించామో అంత తిరిగి వస్తుంది. ఏ మాత్రం కటింగ్‌లు లేకుండా.. 

ఏ క్లాస్ టిక్కెట్ కైనా ఈ రూల్స్ వర్తిస్తాయి. ఇప్పటివరకూ ఎయిర్ లైన్స్‌లో మాత్రమే ఈ సదుపాయం ఉండేది. ఇప్పుడు దీనిని రైల్వేలో కూడా తీసుకురానుండటంతో ప్రయాణికుల డబ్బులు వృథాగా పోతాయనే బాధే ఉండదు.