Rakesh JhunJhunwala : భార్య,తమ్ముడికి కంపెనీ, గురువుకు ట్రస్ట్-ముందే విల్లు రాసిన ఝన్‌ఝన్ వాలా
ఇటీవల కన్నుమూసిన స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝన్‌ఝన్ వాలా తన తదనంతరం తన ఆస్తులు, ట్రస్టులు ఎవరెవరు నిర్వహించాలనేది ముందుగానే విల్లు రాసి ఉంచారు.

rakesh and rk damani
Rakesh JhunJhunwala : ఇటీవల కన్నుమూసిన స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝన్‌ఝన్ వాలా తన తదనంతరం తన ఆస్తులు, ట్రస్టులు ఎవరెవరు నిర్వహించాలనేది ముందుగానే విల్లు రాసి ఉంచారు. తరచుగా తన గురువుగా పిలిచే డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీకి ట్రస్ట్ బాధ్యతలు అప్పచెప్పినట్లు ఒక ఆంగ్ల దిన పత్రిక కధనాన్ని ప్రచురించింది.
ఇతర ట్రస్టీలుగా ఝన్‌ఝన్ వాలా సన్నిహితులైన కల్పరాజ్ ధరమ్షి, అమల్ పారీఖ్ ఉంటారని తెలిపింది. రాకేష్ కు చెందిన రేర్ ఎంటర్ ప్రైజెస్ మాత్రం ఆయనకు విశ్వసనీయులైన ఉత్పల్ సేథ్, అమిత్ గోయల్ నిర్వహణలోనే కొనసాగుతుంది. గత 8 నెలలుగా ఆరోగ్యం బాగోలేకపోవటంతో రాకేష్ ముందుగానే విల్లు సిధ్దం చేసినట్లు ఆ ఆంగ్ల దినపత్రిక పేర్కోంది.
గత కొన్నేళ్లుగా ఉత్పల్ సేథ్ రాకేష్ కు ఈక్విటీ పెట్టుబడుల విషయంలో సహాయం చేస్తూ వస్తున్నారు. ఇక అమిత్ విషయానికి వస్తే ట్రేడింగ్ విషయంలోనూ.. కంపెనీ కి చెందిన ట్రేడింగ్ పుస్తకం నిర్వహణలోనూ కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అమిత్ ను రాకేష్ కు కుడి భుజంగా అందరూ పిలుస్తుంటారు. ఆగస్టు 14న మరణించిన రాకేష్ మరణించే నాటికి నమోదిత, నమోదు కాని కంపెనీల్లో ఆయనకు చెందిన వాటాల్లో ఎక్కువ భాగం ఆయన భార్య రేఖ, ముగ్గురు పిల్లలకు వెళ్లనున్నాయి.
జే సాగర్ అసోసియేట్స్ కు చెందిన మాజీ మేనేజింగ్ పార్టనర్ బెర్జిస్ దేశాయ్ ఇందుకు సంబంధించిన విల్లు పనులను చూస్తున్నట్లు తెలుస్తోంది. భార్య రేఖా ఝన్‌ఝన్ వాలా కూడా వ్యాపార కుటుంబం నుంచే వచ్చినందున ఆమె కూడా ఆర్ధిక అంశాలు బాగానే నిర్వహించవచ్చని… రాకేశ్ సోదరుడు వారి కంపెనీ నిర్వహణలో కీలక పాత్ర పోషించ వచ్చని ఆ వర్గాలు తెలిపాయి.
Also Read : Delhi Firing Two killed : ఢిల్లీలో అర్ధరాత్రి దుండగుల కాల్పులు..ఇద్దరు మృతి