Loans: వీటిపై లోన్లు తీసుకుంటున్నారా? ఏం జరుగుతోందో తెలుసా?
ఈ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

RBI Governor Sanjay Malhotra
చాలా మంది బంగారంపై రుణాలు తీసుకుంటుంటారు. 2024లో బంగారంపై లోన్లు తీసుకున్న వారు విపరీతంగా పెరిగిపోయారు. దీంతో బంగారం రుణాలపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఈ ఏడాది జనవరి నాటికి బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు కలిపి రూ.1.78 లక్షల కోట్ల బంగారు రుణాలను మంజూరు చేశాయి. ఇది సంవత్సర ప్రాతిపదికన పోలిస్తే 76.9 శాతం వృద్ధిని సూచిస్తుంది. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో బంగారం రుణాల వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
మార్కెట్లో బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకునే వారి సంఖ్య క్రమేపి పెరగడంతో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు ఈ రంగంపై అధిక దృష్టి పెట్టాయి. ఒకవేళ రుణగ్రహీత రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే ఆ బంగారాన్ని వేలం వేస్తారు. ఇది బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలకు రుణ నష్టాన్ని తగ్గించి భద్రతను కల్పిస్తుంది. బంగారానికి ఎల్లప్పుడూ మార్కెట్‌లో విలువ ఉంటుంది. కనుక వేలంలో వారు నిర్దేశించిన సొమ్ముతో తొందరగా అమ్ముడుపోతుంది.
Also Read: మీది పాత సిమ్ కార్డా? కేంద్రం సంచలన నిర్ణయం? కోట్లల్లో పాత సిమ్ కార్డులన్నీ తీసేసి..
ఆర్‌ఐబీ బంగారంపై రుణాలు ఇచ్చే సంస్థలపై దర్యాప్తు చేసినపుడు అనేక అవకతవకలను గుర్తించింది. వాటిలో కొన్ని లోపాలు
1) బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు బంగారం విలువను అంచనా వేయడానికి బయటి ఏజెన్సీలపై ఆధారపడుతున్నాయి
2) రుణాలు ఇచ్చే వేళ కస్టమర్ లేకుండానే బంగారం విలువను నిర్ణయిస్తున్నారు
3) రుణం తీసుకునే వ్యక్తి గుర్తింపు, తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందో లేదో వంటి అంశాలపై సరైన తనిఖీ చేయడం లేదు
4) రుణం తీసుకునే వ్యక్తి తిరిగి చెల్లించడంలో విఫలమైతే అతడికి ఎలాంటి సమాచారం లేకుండా తాకట్టుపెట్టిన బంగారాన్ని వేలం వేయడం
5) మార్కెట్లో అప్పుడున్న బంగారం విలువలో 75% మాత్రమే లోన్లు ఇవ్వాలి.. కానీ, ఇలాంటి ‘లోన్ టూ వాల్యూ’ అనే మార్గదర్శకాలు పాటించకపోవడం
6) వివిధ రకాల రుణాలకు ఆర్బీఐ నిర్దేశించిన రిస్క్ వెయిట్‌లను బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు సరిగ్గా వర్తింపజేయడం లేదు
ఈ నేపథ్యంలో ఆర్బీఐ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలను తాము అనుసరిస్తున్న విధానాలు, మార్గదర్శకాలను సమగ్రంగా పునఃసమీక్షించాల్సిందిగా ఆదేశించింది. అంతేగాక, బంగారం రుణాల పోర్ట్‌ఫోలియోను సమర్థవంతంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ అంటోంది.
Read More: మీది పాత సిమ్ కార్డా? కేంద్రం సంచలన నిర్ణయం? కోట్లల్లో పాత సిమ్ కార్డులన్నీ తీసేసి..