ఆ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్…విత్ డ్రా లిమిట్ పెంపు

ముంబై బేస్డ్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC BANK) ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎమ్ సీ ఖాతాదారుల విత్ డ్రా లిమిట్ ను 10వేల పెంచుతూ ఆర్బీఐ నిర్ఱయం తీసుకుంది. ఈ బ్యాంక్ ఖాతాదారులు వెయ్యి రూపాయలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీల్లేకుండా సోమవారం(సెప్టెంబర్-23,2019) ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
అయితే ఆర్బీఐ నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ బ్యాంకు కు ఉన్న ఏడు రాష్ట్రాలలోని 137శాఖల దగ్గర పెద్ద ఎత్తున ఖాతాదారులు ఆందోళనకు దిగారు. దీంతో వెనక్కి తగ్గిన ఆర్బీఐ వెయ్యి రూపాయల విత్ డ్రా లిమిట్ ను 10వేల రూపాయలకు పెంచింది. ఆరు నెలల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది. అంతేకాకుండా పీఎమ్ సీ బ్యాంక్ తమ కస్టమర్లకు ఎలాంటి అడ్వాన్స్ లు, లోన్స్ కానీ ఇవ్వకుండా ఆర్బీఐ నిషేధం విధించింది.
అయితే పీఎమ్ సీ బ్యాంక్ పై విధించిన ఆంక్షలు ఆ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లుగా భావించరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. తదుపరి నోటీసు,సూచనల వరకు పీఎమ్ సీ బ్యాంకింగ్ వ్యాపారం పరిమితులతో కొనసాగుతుందని తెలిపింది.