New Credit Score Rules : ఆర్బీఐ కొత్త క్రెడిట్ స్కోరు రూల్స్.. చౌకగా హోం లోన్లు పొందొచ్చు.. 3 ఏళ్ల పరిమితి ఎత్తేసింది..!
New Credit Score Rules : ఆర్బీఐ క్రెడిట్ స్కోరుకు సంబంధించి మళ్లీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై క్రెడిట్ స్కోరు ఆధారంగా తక్కువ వడ్డీ రేటుకే హోం లోన్లు పొందవచ్చు.
New Credit Score Rules
New Credit Score Rules : కొత్త హోం లోన్ కోసం చూస్తున్నారా? సొంతిల్లు కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి అద్భుతమైన వార్త.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గృహ రుణ గ్రహీతలకు బిగ్ రిలీఫ్ అందించే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు, మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉంటే, మీరు మీ గృహ రుణంపై తక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు. మీ క్రెడిట్ స్కోరు (New Credit Score Rules) చెక్ చేసుకున్నారా? క్రెడిట్ స్కోరు బాగుంటే మీకు తక్కువ వడ్డీకే రుణాలు వస్తాయి. లేదంటే భారీ మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది.
హోం లోన్ తీసుకునేవారి కోసం ఆర్బీఐ కొత్త క్రెడిట్ స్కోరు రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ కింద మూడేళ్ల నాటి పరిమితిని ఎత్తివేసింది. క్రెడిట్ స్కోర్ ఆధారిత వడ్డీ రేట్లను ఆర్బీఐ తిరిగి అమల్లోకి తెచ్చింది. అద్భుతమైన క్రెడిట్ స్కోర్‌లు ఉన్న కస్టమర్లు ఇప్పుడు చౌకైన గృహ రుణాలు పొందవచ్చు. అదేవిధంగా, తక్కువ ఈఎంఐలు చెల్లించవచ్చు.
కొత్త మార్పు ఏంటి? :
గత 3 ఏళ్లుగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్‌ల ఆధారంగా వడ్డీ రేట్లను మార్చకుండా పరిమితం చేశాయి. అయితే, RBI ఇప్పుడు ఈ పరిమితిని ఎత్తివేసింది. హై క్రెడిట్ స్కోర్‌లు ఉన్న కస్టమర్‌లు చౌకైన గృహ రుణ వడ్డీ రేట్లను పొందుతారు. అయితే, తక్కువ స్కోర్‌లు ఉన్నవారు అధిక వడ్డీ రేట్లు చెల్లించాల్సి రావచ్చు.
క్రెడిట్ స్కోరు ఎందుకు ముఖ్యం? :
మీ క్రెడిట్ స్కోర్ మీ ఆర్థిక క్రమశిక్షణకు గుర్తు. మీరు గతంలో తీసుకున్న రుణాలు లేదా క్రెడిట్ కార్డులను ఎంత బాధ్యతాయుతంగా తిరిగి చెల్లించారో మీకు తెలియజేస్తుంది.
- 750 కన్నా ఎక్కువ స్కోరు ఉంటే బెటర్
- మీకు మంచి స్కోరు ఉంటే.. బ్యాంకులు మిమ్మల్ని నమ్మకమైన కస్టమర్‌గా పరిగణించి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇస్తాయి.
- స్కోరు తక్కువగా ఉంటే.. బ్యాంక్ రిస్క్‌ను ఎక్కువగా పరిగణిస్తుంది. అప్పుడు వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది.
గృహ రుణ కస్టమర్లకు ప్రయోజనాలివే :
- వడ్డీ రేట్లు తగ్గడం వల్ల EMI తగ్గుతుంది.
- దీర్ఘకాలంలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి.
- మంచి క్రెడిట్ స్కోరు ఉన్న కస్టమర్లకు త్వరగా లోన్ లభిస్తుంది.
మీరు భవిష్యత్తులో ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే.. ఇప్పుడే మీ క్రెడిట్ స్కోర్‌పై ఫోకస్ పెట్టండి. సకాలంలో ఈఎంఐలు చెల్లించండి. మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను తక్కువగా ఉంచండి. కొత్తవి తీసుకునే ముందు పాత లోన్లను చెల్లించండి. తద్వారా మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపడుతుంది. మీకు గృహ రుణాలు చౌకగా లభిస్తాయి.
