Realme 12 Pro 5G Series : రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Realme 12 Pro 5G Series : రియల్‌మి నుంచి రియల్‌మి ప్రో ప్లస్ 5G ఫోన్ జనవరి 31న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. 6.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, బ్యాటరీతో 50ఎంపీ ప్రైమరీ లెన్స్‌తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉండనుంది.

Realme 12 Pro 5G Series : రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Realme 12 Pro 5G series specifications leaked online ahead of imminent India launch

Realme 12 Pro 5G Series Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్‌మి నుంచి రియల్‌మి 12 ప్రో 5జీ, రియల్‌మి 12ప్రో + 5జీ మోడల్ జనవరి 31న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఇందులో 6.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, కనిష్టంగా 4,880ఎంఎహెచ్ బ్యాటరీ ఉంటుంది. రెండు డివైజ్ 50ఎంపీ ప్రధాన లెన్స్‌తో సహా వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. రియల్‌మి నుంచి మిడ్-రేంజ్ రియల్‌మి 12 ప్రో సిరీస్ జనవలో భారతీయ మార్కెట్‌లో వస్తుందని ఇప్పటికే కంపెనీ ధృవీకరించింది.

Read Also : Apple iPhones Sale : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపులు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

అయినప్పటికీ, ఈ ఫోన్ లాంచ్‌కు ముందే, రియల్‌మి 12 సిరీస్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్‌లు నివేదిక ద్వారా వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం.. రియల్‌మి 12 ప్రో 5జీ, రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ ఫోన్ భారత మార్కెట్లోజనవరి 31 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 2412 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు కనీసం 4,880ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తాయని భావిస్తున్నారు.

రియల్‌మి 12 ప్రో, ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 12 ప్రో 5జీ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. భారత మార్కెట్లో మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. అందులో 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజీ, 8జీబీ ర్యామ్/256జీబీస్టోరేజీ, 12జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజీతో వస్తుంది.

Realme 12 Pro 5G series specifications leaked online ahead of imminent India launch

Realme 12 Pro 5G series specifications leaked 

ఈ స్మార్ట్‌ఫోన్ సబ్‌మెరైన్ బ్లూ, నావిగేటర్ లైట్ బ్రౌన్ కలర్ అనే 2 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. రియల్‌మి 12 ప్రో ఓఐఎస్‌తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 సెన్సార్ ప్రైమరీ సెన్సార్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 32ఎంపీ టెలిఫోటో లెన్స్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు.

మరోవైపు, రియల్‌మి 12 ప్రో ప్లస్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ మొత్తం 2 స్టోరేజ్ వేరియంట్‌లను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజీ, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజీని అందిస్తుంది. ఎక్స్‌ప్లోరర్ రెడ్, నావిగేటర్ బీజ్, సబ్‌మెరైన్ బ్లూ అనే 3 కలర్ వేరియంట్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

రియల్‌మి 12 ప్రో+లో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్890 ప్రైమరీ సెన్సార్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 6ఎక్స్ ఇన్-సెన్సర్ జూమ్, 120ఎక్స్ డిజిటల్ జూమ్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్‌కు సపోర్ట్‌తో 64ఎంపీ టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది.

Read Also : iQOO Neo 7 Pro Price Drop : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. ఐక్యూ నియో 7 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. ఈ ఫోన్ కొనాలా వద్దా?