Realme 12x 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ రియల్‌మి 5జీ ఫోన్ ధర కేవలం రూ.12వేల లోపు మాత్రమే!

Realme 12x 5G Sale : ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి 12x 5జీ ఫోన్ సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ 5జీ ఫోన్ 29శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

Realme 12x 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ రియల్‌మి 5జీ ఫోన్ ధర కేవలం రూ.12వేల లోపు మాత్రమే!

Realme 12x 5G available at under Rs 12k on Flipkart, all details

Realme 12x 5G Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి సరసమైన ధరకే ప్రీమియం ఫీచర్లతో కొత్త 5జీ ఫోన్ అందిస్తోంది. గతంలో ఆకర్షణీయమైన ఫోన్‌లను కంపెనీ ఆవిష్కరించింది. ఇప్పటికే, రియల్‌మి 12ఎక్స్ 5జీ ఫోన్ కూడా గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మీరు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి 12ఎక్స్ 5జీ ఆకట్టుకునే డీల్‌లో అందుబాటులో ఉంది.

రియల్‌మి 12ఎక్స్ 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ. 16,999గా ఉంది. అయితే, ఈ ఫోన్ ప్రస్తుతం 29 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీని మొత్తం ధర రూ. 11,999కి తగ్గింది. మీరు మీ పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటే.. రియల్‌‌మి 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకే పొందవచ్చు. 6జీబీ, 8జీబీ ర్యామ్ ఇతర రెండు వేరియంట్‌ల ధర కొంచెం భిన్నంగా ఉంటుంది.

స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. :
రియల్‌మి 12ఎక్స్ 5జీ ఫోన్ 6.72-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 950 నిట్‌ల ప్రకాశంతో పవర్‌ఫుల్ విజువల్స్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5జీ ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. రియల్‌మి 5జీ ఫోన్ ముఖ్యంగా గేమింగ్ సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేలా స్టీమింగ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ హాట్‌స్పాట్ టెక్నాలజీ, 4జీ, 5జీ మధ్య నెట్‌వర్క్ మారడాన్ని సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ విషయానికి వస్తే.. :
ఈ ఫోన్ 5000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. 45డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జర్‌తో వస్తుంది. బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌ చేయగలదు. రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు కూడా ఉంది. బ్యాటరీ 34 గంటల వరకు నిరంతర కాలింగ్, 19 గంటల సోషల్ మీడియా వినియోగం, 15 గంటల వీడియో స్ట్రీమింగ్, 35 గంటల నిరంతర మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది కంపెనీ పేర్కొంది.

వీసీవీటీ ఇంటెలిజెంట్ ట్యూనింగ్ అల్గారిథమ్, వీఎఫ్‌సీ ట్రికిల్ ఛార్జింగ్ అల్గోరిథం వంటి స్మార్ట్ అల్గారిథమ్‌లు సురక్షితమైన ఛార్జింగ్‌ని అందిస్తాయి. ఫోన్ ఛార్జింగ్ సమయంలో అదనపు భద్రత కోసం 5-కోర్ ప్రొటెక్షన్ సిస్టమ్ కలిగి ఉంది. రియల్‌మి 12ఎక్స్ 5జీ కూడా ఎయిర్ గెస్చర్ ఫీచర్‌తో వస్తుంది. వినియోగదారులు ఫిజిటల్ టచ్ లేకుండా వారి ఫోన్‌లతో ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. తినడం లేదా వంట చేయడం వంటి వివిధ సందర్భాల్లో ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. :
రియల్‌మి ఫోన్ 50ఎంపీ ఏఐ కెమెరాతో వస్తుంది. తక్కువ-కాంతి ఫోటోగ్రఫీ కోసం సూపర్ నైట్‌స్కేప్ మోడ్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్‌తో సహా అనేక ఫొటోగ్రఫీ ఆప్షన్లను కలిగి ఉంది. ఈ డివైజ్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం డ్యూయల్ స్పీకర్లను కూడా కలిగి ఉంది. చివరగా, రియల్‌మి 12ఎక్స్ 5జీ ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. 2టీబీ వరకు స్టోరేజీ విస్తరణను కూడా అందిస్తుంది.

Read Also : Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంతకీ, ఈ ఐఫోన్ కొనాలా? వద్దా? పూర్తి వివరాలివే!