Redmi A3 Launch India : భారీ బ్యాటరీ, ఏఐ డ్యూయల్ కెమెరాలతో రెడ్‌మి A3 ఫోన్ లాంచ్.. ధర రూ.10వేల లోపు మాత్రమే!

Redmi A3 Launch India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి రెడ్‌మి A సిరీస్ ఫోన్ వచ్చేసింది. డ్యూయల్ కెమెరాలు, భారీ బ్యాటరీతో మరింత ఆకర్షణీయంగా ఉంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Redmi A3 Launch India : భారీ బ్యాటరీ, ఏఐ డ్యూయల్ కెమెరాలతో రెడ్‌మి A3 ఫోన్ లాంచ్.. ధర రూ.10వేల లోపు మాత్రమే!

Redmi A3 With Dual Rear Cameras, 5,000mAh Battery Launched

Redmi A3 Launch India : భారత మార్కెట్లోకి కొత్త రెడ్‌మి ఫోన్ వచ్చేసింది. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ A3 సిరీస్ బుధవారం (ఫిబ్రవరి 14) లాంచ్ అయంది. ఈ లేటెస్ట్ ఫోన్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్ హెలియో జీ36 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. రెడ్‌మి A3 ఫోన్ మొత్తం మూడు విభిన్న రంగు ఆప్షన్లు, మూడు ర్యామ్, స్టోరేజీ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. ఏఐ సపోర్టుతో 8ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 10డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది.

Read Also : Hero Mavrick 440 Launch : మూడు వేరియంట్లలో కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ వచ్చేసింది.. ధర ఎంత? డెలివరీలు ఎప్పటినుంచంటే?

భారత్‌లో రెడ్‌మి A3 ధర ఎంతంటే? :
కొత్త రెడ్‌మి A3 ఫోన్ భారత మార్కెట్లో బేస్ 3జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,299గా నిర్ణయించింది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ. 8,299 అయితే 6జీబీ + 128జీబీ మోడల్ ధర రూ. 9,299గా ఉంది. సరసమైన హ్యాండ్‌సెట్ మిడ్‌నైట్ బ్లాక్, లేక్ బ్లూ, ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 23 నుంచి ఫ్లిప్‌కార్ట్, Mi.com, షావోమీ రిటైల్ పార్టనర్ల ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది. రెడ్‌మి A2 మోడల్ గత ఏడాది మేలో రూ. 5999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ ఫోన్ బేస్ 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చింది.

Redmi A3 With Dual Rear Cameras, 5,000mAh Battery Launched

Redmi A3 Launched

రెడ్‌మి A3 స్పెసిఫికేషన్లు :
డ్యూయల్-సిమ్ (నానో) రెడ్‌మి A3 ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్)పై రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.71-అంగుళాల హెచ్‌డీ+ (1,600×700 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో డిస్‌ప్లే సెల్ఫీ షూటర్‌, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంది. కొత్త రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ 3జీబీ ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ36 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. వర్చువల్ ర్యామ్ ఫంక్షనాలిటీతో మెమరీని 12జీబీ వరకు విస్తరించవచ్చు.

రెడ్‌మి ఫోన్ 8ఎంపీ ప్రైమరీ సెన్సార్, సెకండరీ కెమెరాతో కూడిన ఏఐ-బ్యాక్డ్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 5ఎంపీ కెమెరా సెన్సార్ కూడా ఉంది. రెడ్‌మి A3 మోడల్ కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ ఎ-జీపీఎస్, మైక్రో-యూఎస్‌బీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ఉన్నాయి.

అథెంటికేషన్ కోసం యాక్సిలరోమీటర్, ఇ-కంపాస్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. రెడ్‌మి A3 మోడల్ 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దీని కొలతలు 76.3×168.4×8.3ఎమ్ఎమ్, బరువు 193 గ్రాములు ఉంటుంది.

Read Also : Kabira Electric Bikes Launch : కబీరా నుంచి రెండు ఎలక్ట్రిక్ బైకులు వచ్చేశాయి.. గంటకు 120కి.మీ టాప్ స్పీడ్.. ధర ఎంతంటే?