Redmi Note 13 Pro : సూపర్ ఆఫర్ బ్రో.. రెడ్‌మి నోట్ 13ప్రోపై కిర్రాక్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Redmi Note 13 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 13 ప్రో తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుతం రూ.20వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.

Redmi Note 13 Pro
Redmi Note 13 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రెడ్‌మి నోట్ 13 ప్రో ధర ఏకంగా రూ.10వేలు తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సమయంలో (Redmi Note 13 Pro) కేవలం రూ.19,699కే లభ్యమవుతుంది.
ఈ ఫోన్‌లో 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్, 12GB వరకు ర్యామ్ ఉన్నాయి. 200MP మెయిన్ షూటర్, IP54 రేటింగ్ వంటి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో గత ఏడాదిలో షావోమీ రెడ్‌మి నోట్ 13ప్రో భారత మార్కెట్లో భారీగా తగ్గింది.
అసలు ధర రూ. 28,999 ఉండగా ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 19,699 ధరకే కొనుగోలు చేయొచ్చు. రూ.20వేల లోపు ధరలో పవర్‌ఫుల్ కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ ఫోన్. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై ఇన్‌స్టంట్ 5 శాతం తగ్గింపు పొందవచ్చు. రూ.693 నుంచి EMI ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.
స్టోరేజ్ వేరియంట్లు, ధర ఎంతంటే? :
- రెడ్‌మి నోట్ 13 ప్రో ఈ కింది స్టోరేజ్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.
- 8GB ర్యామ్, 128GB స్టోరేజీ
- 8GB ర్యామ్, 256GB స్టోరేజీ
- 12GB ర్యామ్, 256GB స్టోరేజీ
- ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ సమయంలో అన్ని వేరియంట్లు ఇప్పుడు తగ్గింపు ధరకే లభ్యమవుతున్నాయి.
ముఖ్య ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
డిస్‌ప్లే : ఈ ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డాల్బీ విజన్‌కు సపోర్టు ఇస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంటుంది.
పర్ఫార్మెన్స్ : స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్
12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీ
బ్యాటరీ, ఛార్జింగ్ : 5100mAh బ్యాటరీ సపోర్టు, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు
మన్నిక : IP54 రేటింగ్, నీళ్లలో పడినా చెక్కుచెదరదు.
కెమెరా సెటప్ ఫీచర్లు :
బ్యాక్ కెమెరాలు: 200MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సిస్టమ్.
ఫ్రంట్ కెమెరా : వీడియో కాల్స్, 16MP సెల్ఫీ కెమెరా.
రెడ్‌మి నోట్ 13 ప్రో కొనాలా? Redmi Note 13 Pro :
ప్రస్తుత డిస్కౌంట్ ధరకు రెడ్‌మి నోట్ 13 ప్రో కొనేసుకోవచ్చు. మీ బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ కెమెరా క్వాలిటీ, పర్ఫార్మెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది.