ICICI Bank : కస్టమర్లకు బిగ్ షాక్.. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త UPI రూల్స్.. గూగుల్ పే, ఫోన్‌పే పేమెంట్లపై ఛార్జీల మోత..!

ICICI Bank : యూపీఐ లావాదేవీలపై ఐసీఐసీఐ బ్యాంక్ Google Pay, PhonePe వంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లపై ఛార్జీలు విధిస్తోంది.

ICICI Bank : కస్టమర్లకు బిగ్ షాక్.. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త UPI రూల్స్.. గూగుల్ పే, ఫోన్‌పే పేమెంట్లపై ఛార్జీల మోత..!

ICICI Bank

Updated On : August 3, 2025 / 5:33 PM IST

ICICI Bank : ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బిగ్ షాక్.. యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? ఐసీఐసీఐ కొత్త యూపీఐ రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ఇప్పటినుంచి గూగుల్ పే, ఫోన్‌పే  (ICICI Bank) వంటి డిజిటల్ యాప్ ప్లాట్ ఫాంల నుంచి చేసే యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు వసూలు విధిస్తోంది. వాస్తవానికి ఈ కొత్త యూపీఐ రూల్స్ ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చాయి.

ICICI బ్యాంకు కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు పేమెంట్ అగ్రిగేటర్ల (PA) ద్వారా పేమెంట్లపై ఛార్జీలు చెల్లించాలి. అయితే, ఈ ఛార్జీలు మర్చంట్ అకౌంట్ నుంచి మాత్రమే వసూలు చేస్తుంది. సాధారణ వినియోగదారులపై ఎలాంటి ఛార్జీలు లేవు. పేమెంట్ అగ్రిగేటర్లపై ఎంత ఛార్జీ విధిస్తుంది? కొత్త రూల్స్ ఏంటి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పేమెంట్ అగ్రిగేటర్లకు కొత్త ఫీజు :
పేమెంట్ అగ్రిగేటర్లు బ్యాంకులు, (ICICI Bank) మర్చంట్ మధ్య మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. నివేదికల ప్రకారం.. బ్యాంకులో ఎస్క్రో అకౌంట్ వాడే వారు ప్రతి లావాదేవీకి 2 బేసిస్ పాయింట్లు చెల్లిస్తారని ఐసీఐసీఐ బ్యాంక్ పేమెంట్ అగ్రిగేటర్లకు తెలిపింది.

ఎవరైనా ICICI బ్యాంక్ పేమెంట్ అగ్రిగేటర్‌లో ఎస్క్రో అకౌంట్ కలిగి ఉంటే వారి నుంచి ప్రతి లావాదేవీకి 0.02 శాతం ఛార్జ్ విధిస్తుంది. ఈ ఛార్జీ గరిష్ట పరిమితి రూ.6 మించదు. ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎస్క్రో అకౌంట్ లేని వారికి 0.04 శాతం వసూలు చేయవచ్చు. గరిష్ట ఛార్జీ ప్రతి లావాదేవీకి రూ. 10 మించదు.

Read Also : Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే..? ఇలాంటి ఆఫర్ మళ్లీ జన్మలో రాదు..!

యూపీఐ పేమెంట్లు నేరుగా మర్చంట్ ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అయితే ఎలాంటి ఛార్జీలు వర్తించవు. ఈ ఫండ్స్ ద్వారా బ్యాంక్ ప్రయోజనం ఉంటుంది. యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ సంస్థలు ఇప్పటికే యూపీఐ పేమెంట్లపై పేమెంట్ అగ్రిగేటర్ల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

ఈ 3 బ్యాంకులు చెల్లింపుదారులకు యూపీఐ లావాదేవీలలో ప్రధాన వాటాను కలిగి ఉంటాయి. ముఖ్యంగా పీర్-టు-మర్చంట్ లావాదేవీలలో యూపీఐ వినియోగం పెరగడంతో బ్యాంకులకు మౌలిక సదుపాయాల ఖర్చులు పెరిగాయని నిపుణులు అంటున్నారు. యూపీఐ లావాదేవీలు మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ని ఆకర్షించవు. తద్వారా ద్వారా తక్కువ ఆదాయాన్ని పొందుతాయి.

మర్చంట్స్, యూజర్లపై ప్రభావం :
ప్రస్తుతం యూపీఐ చెల్లింపులపై (ICICI Bank) బ్యాంకులు సైతం ఛార్జీలు చెల్లిస్తున్నాయి. పేమెంట్ అగ్రిగేటర్లు, ప్లాట్‌ఫామ్ ఫీజులు, సౌకర్య రుసుములు, ఇతర ఛార్జీల ద్వారా మర్చంట్ నుంచి ఛార్జీలను వసూలు చేస్తాయి. అయితే, వినియోగదారులకు నేరుగా యూపీఐ ఛార్జీల నుంచి మినహాయింపు పొందవచ్చు. కస్టమర్లు మర్చంట్ ప్లాట్‌ఫామ్‌లలో యూపీఐ ద్వారా పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ అగ్రిగేటర్లు లావాదేవీని కస్టమర్ బ్యాంక్, మర్చంట్ బ్యాంక్ మధ్య మళ్లిస్తుంది.

ఇలాంటి ఫండ్స్ మర్చంట్ బదిలీ చేసే ముందు పేమెంట్ అగ్రిగేటర్ ఎస్క్రో అకౌంటులో క్రెడిట్ చేస్తారు. ఈ సెటప్ సెటిల్‌మెంట్ సెక్యూర్‌గా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త రూల్స్ కారణంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు.

యూపీఐ కొత్త నిబంధనలివే :

  • బ్యాలెన్స్ చెకింగ్ లిమిట్
  • ఒకే యాప్‌లో బ్యాంక్ అకౌంట్ చెకింగ్
  • ఒకే సమయంలో ఆటోపే
  • పేమెంట్ స్టేటస్ చెకింగ్ లిమిట్
  • పేమెంట్ రివర్సల్‌పై లిమిట్

ఇకపై యూపీఐ పేమెంట్ల సమయంలో ఎలాంటి సమస్య ఉండదు. ఇటీవలే వినియోగదారులు యూపీఐ పేమెంట్లు చేస్తున్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. యూపీఐ సర్వర్ దాదాపు ప్రతిరోజూ డౌన్ అయ్యేది. NPCI ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది.