Reliance JioMart Layoffs : కోత మొదలైంది.. జియోమార్ట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు.. మరో 9వేల జాబ్స్ తగ్గించే అవకాశం..!
Reliance JioMart Layoffs : రిలయన్స్ జియోమార్ట్ ఉద్యోగాల్లో కోత విధిస్తోంది. కంపెనీలో వర్క్‌ఫోర్స్‌ను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. జియోమార్ట్ దేశమంతటా తమ మార్ట్ సెంటర్లను మూసివేయాలని భావిస్తోంది.

Reliance JioMart fires 1000 employees, expected to cut 9000 more jobs in coming months
Reliance JioMart Layoffs 1000 Employees : ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ రిలయన్స్ జియోమార్ట్ (Reliance Jiomart)లో ఉద్యోగాల్లో కోత విధిస్తోంది. తాజాగా రిలయన్స్ సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే వారాల్లో జియోమార్ట్‌లో దాదాపు 9,900 స్థానాల్లో మరిన్ని ఉద్యోగాలను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. ఎందుకంటే.. భారతీయ రిటైల్ దిగ్గజం వర్క్ ఫోర్స్ తగ్గించుకోవాలని చూస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు మరింత వృద్ధిని సాధించడంపై రిలయన్స్ దృష్టి పెట్టాలనుకుంటోంది. నివేదిక ప్రకారం.. జియోమార్ట్ ఉద్యోగులను రిలయన్స్ రాజీనామా చేయాలని కోరినట్టు తెలిపింది.
మరో రౌండ్ తొలగింపులకు ప్లాన్ :
గత కొన్ని రోజులుగా కంపెనీ కార్పొరేట్ ఆఫీసులోని 500 మంది ఎగ్జిక్యూటివ్‌లతో సహా ఫీల్డ్ ఉద్యోగులతో కలిపి మొత్తం 1,000 మందిని రాజీనామా చేయమని కోరింది. వందలాది మంది ఉద్యోగులతో ఇప్పటికే పనితీరు మెరుగుదల ప్రణాళిక (PIP)పై మరో రౌండ్ తొలగింపులకు ప్లాన్ చేస్తోందని నివేదిక వెల్లడించింది. (JioMart) చాలా తక్కువ ధరలకే అందిస్తోంది.
దాంతో సాంప్రదాయ పంపిణీదారులు తమ సరఫరాలు ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు, జియోమార్ట్ మరింత లాభాలను ఆర్జించడంతో పాటు వారి నష్టాలను తగ్గించుకోవడంపై దృష్టి పెడుతోంది. అందుకే, ఉద్యోగుల తొలగింపు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Reliance JioMart Layoffs 1000 employees, expected to cut 9000 more jobs in coming months
అందుకే ఉద్యోగులను తొలగిస్తోంది :
పంపిణీదారుల లాభాలను మెరుగుపరిచేందుకు జియోమార్ట్ సెంటర్లలో సగానికి పైగా మూసివేయాలని యోచిస్తోంది. ఈ జియోమార్ట్ సెంటర్లకు పంపిణీదారులు తమ ప్రొడక్టులను తయారు చేసి లోకల్ షాపులకు పంపుతారు. అదే సమయంలో, రిలయన్స్ రిటైల్, మెట్రో AG జర్మన్ రిటైలర్ భారతీయ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది.
ఈ కొనుగోలుకు జియోమార్ట్‌కు 344 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఇదే జియోమార్ట్ ఈ మార్పులు చేయడానికి మరో కారణంగా చెప్పవచ్చు. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే భారత్‌లో ఆన్‌లైన్ బిజినెస్-టు-బిజినెస్ (B2B) రిటైల్ మార్కెట్‌లో మెట్రో 3,500 మంది కార్మికులను చేర్చుకుంది. దాంతో కంపెనీలో కొంతమంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.
భారత్‌లో రిటైల్ పరిశ్రమకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. జియోమార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు రిటైల్ మార్కెట్ వృద్ధిపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నాయి. జియోమార్ట్ ధరలను బ్యాలెన్స్ చేయాలని భావిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు జియోమార్ట్ తమ రిటైల్ మార్కెట్ మరింత విస్తరిస్తోంది. ఆన్‌లైన్ B2B రిటైల్ వ్యాపారాన్ని స్మార్ట్, స్థిరమైన మార్గంలో పెంచుకోవాలని భావిస్తోంది. అందుకే, జియోమార్ట్‌లో ఉద్యోగులను తొలగించడం ద్వారా జియోమార్ట్ సెంటర్లను మూసివేయనుంది.
Read Also : Ola Electric Funding : ఈవీ స్కూటర్ మేకర్ ఫండ్ రైజింగ్ ప్లాన్.. రూ.2,500 కోట్ల నిధులు దక్కించుకున్న ఓలా..!