ఇండియాలో లాంచ్ : Renault Triber కారు.. ధర ఎంతంటే?

ఫ్రెంచ్ ఆటో మేజర్ ఆటో మోటార్ కంపెనీ రెనాల్ట్ కొత్త కారును ఇండియా మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్ కారులో మొత్తం 7 సీట్లు ఉండగా మల్టీ పర్పస్ వెహికల్ గా వినియోగించుకునేలా ఉంది.

  • Published By: sreehari ,Published On : August 28, 2019 / 11:34 AM IST
ఇండియాలో లాంచ్ : Renault Triber కారు.. ధర ఎంతంటే?

Updated On : August 28, 2019 / 11:34 AM IST

ఫ్రెంచ్ ఆటో మేజర్ ఆటో మోటార్ కంపెనీ రెనాల్ట్ కొత్త కారును ఇండియా మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్ కారులో మొత్తం 7 సీట్లు ఉండగా మల్టీ పర్పస్ వెహికల్ గా వినియోగించుకునేలా ఉంది.

ఫ్రెంచ్ ఆటో మేజర్ ఆటో మోటార్ కంపెనీ రెనాల్ట్ కొత్త కారును ఇండియా మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్ కారులో మొత్తం 7 సీట్లు ఉండగా మల్టీ పర్పస్ వెహికల్ గా వినియోగించుకునేలా ఉంది. దీని ధర మార్కెట్లలో రూ.4.95 లక్షల నుంచి రూ.6.49 లక్షల వరకు పలుకుతోంది. రెనాల్ట్ కంపెనీ నుంచి ట్రైబర్ రెండో మోడల్. అంతకుముందు Kwid మోడల్ కారును లాంచ్ చేసింది.

ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకించి ఈ రెండు మోడళ్లను రెనాల్ట్ డిజైన్ చేసింది. రెనాల్ట్ ట్రైబర్ కారులో ఒక లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 4 ఎయిర్ బ్యాగులు, వివిధి ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ రిలీజ్ సందర్భంగా కంపెనీ సీఈఓ ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి మాట్లాడుతూ..‘ఇండియాలో ట్రైబర్ మోడల్ కార్లను విస్తరించేందుకు ఎంతో కీలకం. 

రెనాల్ట్ బ్రాండ్ ఆటోమాటివ్ మార్కెట్లో వేగంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం’అని అన్నారు. ఈ కొత్త మోడల్ ట్రైబర్.. క్విడ్ మోడల్ మాత్రమే కాకుండా కంపెనీ అందించే ఇతర SUV కార్లలో డస్టర్, క్యాప్టర్ మధ్య వారదిలా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కంపెనీ వృద్ధి సాధించడంపై ఫోకస్ పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన రెస్పాన్స్ ఉంది.

ట్రైబర్ కారు.. కేవలం నగర కస్టమర్లను మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లను ప్రత్యేక ఆధారణ పొందుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ కొత్త మోడల్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టడంలో భాగంగా వచ్చే మూడేళ్ల కాలంలో దేశంలో ఏడాదికి 2 లక్షల యూనిట్ల సేల్స్ రెట్టింపు చేయడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నట్టు కంపెనీ భావిస్తోంది.