పెరిగిన బంగారం, వెండి ధరలు

  • Published By: bheemraj ,Published On : November 9, 2020 / 06:01 PM IST
పెరిగిన బంగారం, వెండి ధరలు

Updated On : November 9, 2020 / 6:29 PM IST

Rising gold prices : బంగారం ధర అంతకంతకు పెరుగుతోంది. పసిడి ధర బగ్గుమంటోంది. ప్రపంచ మార్కెట్ లో విలువైన లోహాల ధరలు పెరగడంతో భారత మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. MCXలో గోల్డ్ ప్యూచర్స్ లో బంగారం ధర 10 గ్రాములకు రూ.52,393కు చేరుకోగా వెండి కిలో రూ.66090లకు చేరింది.



MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.226 పెరిగి రూ.52,393కు చేరుకుంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.640 పెరిగి రూ.53వేల 20లకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ.580 పెరిగి 48 వేల 600లకు చేరింది. ఇక బంగారం ధర పెరగడం వరుసగా ఇది మూడో రోజు.



5 రోజుల్లో బంగారం ధర రూ.1500 పెరిగింది. మరోవైపు కిలో వెండి రూ.755 పెరిగి 66 వేల 90 రూపాయలకు చేరింది. వారం రోజుల్లో వెండి ధర 4 వేల రూపాయలకు ఎగబాకింది.



గత 5 రోజుల్లో బంగారం ధర సుమారు 1500 రూపాయలు పెరిగింది. వారం రోజుల్లో వెండి కిలోకు 4000 రూపాయలు భారమైంది. ఆగస్టులో బంగారం ధర 10 గ్రాములకు 56,200 రూపాయల రికార్డు స్థాయికి చేరుకుంది.