Samsung Galaxy A05s Launch : శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ భయ్యా.. ఫీచర్ల కోసమైన ఈ గెలాక్సీ A05s ఫోన్ కొనేసుకోండి..!

Samsung Galaxy A05s Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. భారత మార్కెట్లోకి శాంసంగ్ నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. రూ. 15వేల లోపు ధరలో 5G రేంజ్ ఫీచర్లతో అందుబాటులో ఉంది.

Samsung Galaxy A05s Launch : శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ భయ్యా.. ఫీచర్ల కోసమైన ఈ గెలాక్సీ A05s ఫోన్ కొనేసుకోండి..!

Samsung Galaxy A05s launched in India

Samsung Galaxy A05s Launch : శాంసంగ్ అభిమానులకు అదిరే వార్త.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A05s ఫోన్ (Samsung Galaxy A05s) రూ. 15వేల లోపు ధరలో లాంచ్ అయింది. 5Gకి బదులుగా 4G మోడల్ 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాదు.. 5,000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ సహా మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది.

Read Also : Samsung Galaxy S24 Ultra : అద్భుతమైన కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?

భారత్‌లోని చాలా ప్రాంతాల్లో 5G అందుబాటులో ఉండటంతో అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ విభాగంలో 5G డివైజ్‌లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఈ ధర పరిధిలో 4G ఫోన్‌ను సౌత్ కొరియన్ దిగ్గజం ఎందుకు ప్రకటించిందో క్లారిటీ లేదు. శాంసంగ్ కూడా ఇదే ధర వద్ద మంచి 5G ఫోన్‌ (Samsung Galaxy M14)ను అందిస్తోంది. కంపెనీ వివిధ ధరల పాయింట్ల వద్ద మరిన్ని ఆప్షన్లను అందిస్తోంది. కొత్త శాంసంగ్ గెలాక్సీ A05s భారత్ ధర, స్పెషిఫికేషన్లను ఓసారి పరిశీలించండి.

శాంసంగ్ గెలాక్సీ A05s భారత్ ధర ఎంతంటే? :

శాంసంగ్ గెలాక్సీ A05s ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 ప్రారంభ ధరతో వస్తుంది. (SBI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,000 తగ్గింపుతో సహా కొన్ని లాంచ్ ఆఫర్‌లను కంపెనీ ఆవిష్కరించింది. మీరు బ్యాంక్ కార్డ్ ఆఫర్‌ ద్వారా ఈ 4G ఫోన్ ధరను రూ.13,999కి పొందవచ్చు. శాంసంగ్ ప్రత్యేకమైన, రిటైల్ స్టోర్‌లు, (Samsung.com), ఇతర ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా కొత్త శాంసంగ్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A05s launched in India

Samsung Galaxy A05s launch

శాంసంగ్ గెలాక్సీ A05s స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :

కొత్త శాంసంగ్ (Galaxy A05s) స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో భారీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 6.7-అంగుళాల FHD+ డిస్‌ప్లే కలిగి ఉంది. పంచ్ హోల్ నాచ్‌కు బదులుగా ఫ్రంట్ సైడ్ టియర్‌డ్రాప్ నాచ్ ఉంది. ఎందుకంటే శాంసంగ్ అనేక ఇతర బ్రాండ్‌లు తక్కువ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఒకే నాచ్ డిజైన్‌ను అందిస్తున్నాయి. బ్యాక్ సైడ్ శాంసంగ్ ‘ఫ్లోటింగ్’ కెమెరా సిస్టమ్‌ను చూడవచ్చు. ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S23 సిరీస్‌ని పోలి ఉంటుంది. కంపెనీ మిడిల్ క్లాస్, బడ్జెట్ ఫోన్లలో చాలా వరకు అందిస్తోంది. పరిమిత బడ్జెట్ కలిగిన యూజర్ల కోసం ఫ్లాగ్‌షిప్ డిజైన్ కూడా అందిస్తోంది.

Samsung Galaxy A05s launched in India

Samsung Galaxy A05s launched in India

డివైజ్ హుడ్ కింద.. శాంసంగ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌ (4G చిప్)ను అందిస్తోంది. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ A05s RAM డివైజ్ RAM ప్లస్ ఫీచర్‌తో 12GB వరకు పొడిగించుకోవచ్చు. 50MP మెయిన్ సెన్సార్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. శాంసంగ్ కొత్త ఆఫర్‌తో ‘స్పష్టమైన ఫొటోలను’ పొందుతారని పేర్కొంది. రెండు ఇతర సెన్సార్లు 2MP డెప్త్, 2MP మాక్రో కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలను తీయడానికి 13MP సెన్సార్ కూడా ఉంది.

Samsung Galaxy A05s ఫుల్ స్పెసిఫికేషన్స్ :
* 6.7-అంగుళాల (1080 x 2400 పిక్సెల్స్) FHD+ LCD స్క్రీన్
* Adreno 610 GPUతో Qualcomm Snapdragon 680 మొబైల్ ప్లాట్‌ఫారమ్
* 6GB LPDDR4X RAM (RAM ప్లస్‌తో 12GB వరకు), 128GB UFS 2.2 స్టోరేజీ, మైక్రో SDతో 1TB వరకు మెమరీ
* OneUI కోర్‌తో Android 13, 2 OS అప్‌గ్రేడ్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్
* డ్యూయల్ సిమ్ (నానో + నానో + మైక్రో SD)
* f/1.8 ఎపర్చరుతో 50MP బ్యాక్ కెమెరా, 2MP డెప్త్, 2MP మాక్రో కెమెరాలు f/2.4 ఎపర్చరుతో, LED ఫ్లాష్
* f/2.0 ఎపర్చరుతో 13MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు

Samsung Galaxy A05s launched in India

Samsung Galaxy A05s  Specifications Security Update

* సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
* 3.5mm ఆడియో జాక్
* కొలతలు : 168.0 x 77.8 x 8.8mm, బరువు: 194 గ్రాములు.
* డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-C
* 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీ, ఇన్-బాక్స్‌లో ఛార్జర్ లేదు

భారత్‌లో ధర, లభ్యత :
శాంసంగ్ గెలాక్సీ A05s ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ వైలెట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 14,999, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, అధీకృత స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఆసక్తి గల
కొనుగోలుదారులు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ ద్వారా రూ. 1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : WhatsApp View Once Mode : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వాయిస్ నోట్స్ కోసం ‘వ్యూ వన్స్’ మోడ్ ఇదిగో..!