SBI Credit Card : SBI కార్డు వాడుతున్నారా? జాగ్రత్త.. ఓవర్‌డ్యూ రిపోర్టులతో క్రెడిట్ స్కోర్‌కు భారీ నష్టం!
SBI Credit Card Users : ఎస్బీఐ కార్డుదారులకు బిగ్ షాకింగ్ న్యూస్.. సిబిల్ స్కోరు ఒక్కసారిగా 70 పాయింట్లు తగ్గిందంటూ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఓవర్ డ్యూ స్టేటస్ కారణంగానే ఈ ఇష్యూ తలెత్తినట్టు చెబుతున్నారు.
SBI Credit Card
- ఎస్బీఐ కార్డు వినియోగదారుల్లో ఆందోళన
- టైంకి చెల్లించినా ‘బకాయి’గా చూపించిందంటూ ఫిర్యాదులు
- 50 నుంచి 70 పాయింట్లు తగ్గాయంటూ ఫిర్యాదు
SBI Credit Card Users : మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందా? మీ సిబిల్ స్కోరు ఏమైనా తగ్గిందా? ఓసారి చెక్ చేసుకోండి.. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారుల్లో ప్రస్తుతం ఒకటే చర్చ జరుగుతోంది. జూలై నెల బిల్లులకు సంబంధించి కొందరి ఖాతాల్లో తప్పుగా ‘ఓవర్‌డ్యూ’గా కనిపించిందనే ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు కట్టినప్పటికీ తమ క్రెడిట్ రిపోర్టుల్లో బకాయి ఉన్నట్లు చూపించడంతో సిబిల్ స్కోర్లు భారీగా పడిపోయాయని పలువురు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.
50 నుంచి 70 పాయింట్లు తగ్గాయంటూ ఫిర్యాదు :
ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులు తమ సిబిల్ స్కోరు 50 పాయింట్ల నుంచి 70 పాయింట్ల వరకు తగ్గిందని సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు తమ పేమెంట్ డెడ్ లైన్ ఇంకా ముగియకముందే క్రెడిట్ రిపోర్టులో ‘మినిమమ్ అమౌంట్ డ్యూ ఓవర్‌డ్యూ’గా కనిపించిందని వాపోయారు. ఇప్పటికే క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించినా కూడా ఓవర్‌డ్యూ ట్యాగ్ అలాగే ఉందని ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు ఆందోళన చెందారు.
Read Also : Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు..!
క్రెడిట్ కార్డు నిపుణుడు రవి మహేశ్వరి కూడా ఇదే అంశంపై స్పందించారు. ఎస్బీఐ కార్డు వినియోగదారులు తమ సిబిల్ రిపోర్టులను వెంటనే చెక్ చేయాలని ఆయన సూచించారు. తప్పుగా ఏమైనా వివరాలు నమోదైతే క్రెడిట్ కార్డు స్టేట్మెంట్, పేమెంట్ ఆధారాలతో ఎస్బీఐ కార్డు నోడల్ అధికారిని సంప్రదించాలని సూచించారు.
Alert 🔔 – Holding an SBI Credit card 💳 ??
Check your CIBIL score once ‼️
Many users have reported that SBI Credit cards have incorrectly reported the overdue to CIBIL. Several users claimed to have seen a 50-60 point drop in their CIBIL scores
Check now and confirm, write to…
— Vineeth K (@DealsDhamaka) July 13, 2026
క్రెడిట్ కార్డు రిపోర్టు చెక్ చేసుకోండి :
మరోవైపు, చాలామంది యూజర్లు తమకు ఎదురైన అనుభవాలను సైతం షేర్ చేశారు. క్రెడిట్ స్కోరు తగ్గిందనే ఫిర్యాదుల నేపథ్యంలో రిపోర్టులు పరిశీలించుకోవాలని సూచించారు. అయితే, కొందరి వ్యక్తిగత క్రెడిట్ రిపోర్టుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదని అంటున్నారు.
🚨 SBI Credit Card Holders- Check CIBIL report NOW!
SBI Cards wrongly reported July bills as OVERDUE
→ Many seeing 50-70+ point drops
If affected, mail nodal officer immediately: nodalofficer@sbicard.com with statements + proof.
Tag others. Let’s get this fixed fast!… pic.twitter.com/CK3xonIWHN
— Ravi Maheshwari (@CreditCardsInd) July 12, 2026
వాస్తవానికి, క్రెడిట్ స్కోరు అనేది లోన్లకు చాలా ముఖ్యం. ఈ స్కోరు ఆధారంగా బ్యాంకులు లోన్లు ఎంత ఇవ్వాలి? అసలు ఇవ్వాలో డిసైడ్ చేస్తాయి. హోమ్ లోన్, పర్సనల్ లోన్.. లేదంటే కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లయ్ చేసినప్పుడు బ్యాంకులు ఈ స్కోరునే పరిగణలోకి తీసుకుంటాయి. మీరు ఏదైనా తప్పుగా ఇచ్చినా ఓవర్‌డ్యూ ఎంట్రీలు తాత్కాలికమైనా లోన్ పొందడంపై నేరుగా ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది.
ప్రస్తుతం ఎస్బీఐ కార్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అసలు ఈ సమస్య ఎంతమంది యూజర్లపై ప్రభావం పడిందో క్లారిటీ లేదు. అయితే, ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు ఇకపై లేటెస్ట్ సిబిల్ రిపోర్టులను పరిశీలించి, పేమెంట్ రికార్డులను జాగ్రత్తగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
