SBI General Insurance: హైదరాబాద్‌లో నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన SBI జనరల్ ఇన్సూరెన్స్
ఈ కార్యాలయం మూడు రాష్ట్రాల్లో వివిధ ఛానెల్‌లు, లైన్స్ ఆఫ్ బిజినెస్ (LoBs)కి కేంద్ర బిందువుగా పనిచేస్తూ, సజావు సమన్వయం, మెరుగైన కస్టమర్ సేవను అందిస్తుందని తెలిపారు

Hyderabad: భారతదేశంలోని ప్రముఖ బీమా కంపెనీలలో ఒకటైన SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ, కర్ణాటక, అమరావతిలలో తన ఉనికిని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో తన కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. SBI జనరల్ ఇన్సూరెన్స్ MD & CEO కిషోర్ కుమార్ పోలుదాసు, SBI – హైదరాబాద్ సర్కిల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ జింగ్రాన్, SBI – అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ నవీన్ చంద్ర ఝా సమక్షంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.
UNESCO: పీరియడ్స్‌పై విస్తృత ప్రచారం చేసేందుకు యునెస్కో-విస్పర్ కీలక కార్యక్రమం
హైదరాబాద్‌లో ఈ కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా, బీమా అవగాహనను బలోపేతం చేయడం, దాని పరిధిని విస్తరించడం లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతుందని ప్రతినిధులు అన్నారు. ఈ కార్యాలయం మూడు రాష్ట్రాల్లో వివిధ ఛానెల్‌లు, లైన్స్ ఆఫ్ బిజినెస్ (LoBs)కి కేంద్ర బిందువుగా పనిచేస్తూ, సజావు సమన్వయం, మెరుగైన కస్టమర్ సేవను అందిస్తుందని తెలిపారు. ఈ వ్యూహాత్మక చర్య హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులు, వ్యాపారుల జీవితాలను ఆస్తులను సురక్షితం చేయడంలో SBI జనరల్ యొక్క అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.