Mobile Phones Price Hike : షాకింగ్ న్యూస్.. పెరగనున్న స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ ధరలు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Mobile Phones Price Hike : కొత్త స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, తొందరగా కొనేసుకోండి. అతి త్వరలో ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Mobile Phones Price Hike : షాకింగ్ న్యూస్.. పెరగనున్న స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ ధరలు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Price Hike : Smartphone, Smart Tv And Laptop May Become Expensive In Coming Days

Updated On : June 13, 2023 / 9:24 PM IST

Mobile Phones Price Hike : మీరు స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్ (Laptop Prices) లేదా మొబైల్ ఫోన్ (Mobile Phone Prices) కొనాలని చూస్తున్నారా? అయితే, వెంటనే త్వరపడండి. ఎందుకంటే.. రానున్న రోజుల్లో ఈ ఎలక్ట్రానిక్ డివైజ్‌ల (Electronic Device Prices) ధరలను కంపెనీలు అమాంతం పెంచే అవకాశం కనిపిస్తోంది. వీటికి సంబంధించిన ముఖ్యమైన స్పేర్ పార్టుల (Spare Parts Prices Hike) ధరలు మార్కెట్‌లో వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ స్పేర్ పార్టుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అతి త్వరలో ధరల పెంపుపై కంపెనీలు ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి, ఓపెన్ సెల్స్ స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. గ్లోబల్ మార్కెట్‌లో దీని ధర ఒక్కసారిగా పెరిగింది. టెలివిజన్ తయారీదారులు తమ కొత్త స్మార్ట్ టీవీ సెట్‌ల ధరలను కూడా భారీగా పెంచనున్నారు. దీని ప్రభావం పెద్ద స్క్రీన్ టీవీల ధరలపై కనిపించనుంది. స్మార్ట్ టీవీలో ఓపెన్ సెల్ అనేది ప్రైమరీ పార్ట్ అని చెప్పవచ్చు. టెలివిజన్ మొత్తం ఖర్చులో ఆ పార్ట్ వాటా 60 నుంచి 65 శాతంగా ఉంటుంది. ఇప్పటికే ఓపెన్ సేల్ ధరలు సగటున 15 శాతం పెరిగాయని టీవీ తయారీదారులు చెబుతున్నారు. ఓపెన్ సేల్ ధరల పెరుగుదల కారణంగానే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే.. మొబైల్ ఫోన్‌లలో కూడా ఇదే పార్ట్ వినియోగిస్తున్నారు. కానీ, మొబైల్ ఫోన్ల ఖర్చులో వాటా టీవీ కన్నా తక్కువగా ఉంటుంది.

Read Also : Xiaomi Pad 6 Launch : అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 6 వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అధికారులు అమర్ ఉజాలాతో జరిపిన చర్చలో 2022లో ఓపెన్ సెల్స్ ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. కానీ, 2023 ప్రారంభం నుంచి ధరల పెరుగుదల మొదలైంది. జనవరి నుంచి జూన్ వరకు వీటి ధరలు 15 నుంచి 17 శాతం పెరిగాయి. 32-అంగుళాల టీవీలో ఉపయోగించే ఓపెన్ సెల్ (Open Cell) ఒక్కో ప్యానెల్‌కు దాదాపు 27 డాలర్లు ఖర్చవుతుంది. అయితే ధరల్లో సగటు పెరుగుదల 15 శాతం రేంజ్‌లో ఉంటుంది. ప్రపంచంలోని చాలా ఓపెన్ సెల్ ప్యానెల్స్ 4 నుంచి 5 చైనీస్ కంపెనీలచే తయారయ్యాయి. అలాంటి పరిస్థితిల్లో కంపెనీ తయారీదారులపై ధర పెరుగుదల ప్రభావం భారత్ సహా ప్రపంచ దేశాలలో కనిపిస్తుంది.

Price Hike : Smartphone, Smart Tv And Laptop May Become Expensive In Coming Days

Mobile Phones Price Hike : Smartphone, Smart Tv And Laptop May Become Expensive In Coming Days

జూలై నుంచి 10శాతం ధరలు పెరిగే అవకాశం :
ప్రస్తుత పరిస్థితుల కారణంగా చాలావరకూ ఎలక్ట్రానిక్ కంపెనీలు తమ ప్రొడక్టులపై ధరలను భారీగా పెంచాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీ, ల్యాప్‌టాప్‌ల కంపెనీల తయారీదారులు ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటివరకు వీటి ధర 25 నుంచి 30 శాతం పెరిగిందని అంటున్నారు. అందులోనూ సరఫరా కొరత కూడా భారీగా పెరిగినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల తయారీ కంపెనీలు తమ ధరలను పెంచక తప్పదని భావిస్తున్నట్టు సమాచారం.

ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన అనే టీవీల ధరల కూడా 10 శాతం వరకు పెరిగాయి. ఓపెన్ సేల్ ధరలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. రాబోయే పండుగ సీజన్ వరకు ధరల పెరుగుదల కొనసాగుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓపెన్ సేల్ ధరలు పెరిగినా వాటి ప్రభావం వినియోగదారులపై పడదనే చెప్పాలి. ఎందుకంటే.. రిటైలర్లు వద్ద 30 నుంచి 60 రోజుల స్టాక్‌ను ఉంచుకుంటారు. రాబోయే రెండు నెలల్లో ధరల పెంపు ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.

ధరల పెరుగుదలపై ప్రభుత్వం నిర్ణయం ఏంటి? :
స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌టీవీల పార్టులపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా పెరిగిన ధరను కొంతమేరకు భర్తీ చేయాలని ప్రయత్నించే అవకాశం ఉందని ప్రభుత్వ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సమయంలో టీవీ ప్యానెళ్లలోని కొన్ని ఓపెన్ సెల్ భాగాలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేదానిపై కూడా ఎలాంటి సమాచారం లేదు.

Read Also : Maruti Suzuki Invicto Bookings : జూన్ 19 నుంచి మారుతి సుజుకి ఇన్విక్టో బుకింగ్స్.. ధర తెలియాలంటే జూలై 5 వరకు ఆగాల్సిందే..!