జైపూర్-రేణిగుంటల మధ్య ప్రత్యేక రైలు

  • Published By: chvmurthy ,Published On : December 7, 2019 / 02:41 AM IST
జైపూర్-రేణిగుంటల మధ్య ప్రత్యేక రైలు

Updated On : December 7, 2019 / 2:41 AM IST

ప్రయాణికుల రద్దీ  దృష్ట్యా భారతీయ రైల్వే జైపూర్‌-రేణిగుంటల మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ రైలు 6 సర్వీసులు నడుస్తుంది. 

09715 నంబరు తో నడిచే ఈ ప్రత్యేక రైలు  జైరూర్ లో  డిసెంబర్ 13, 20, 27 తేదీల్లో రాత్రి 9.40 గంట లకు బయలుదేరి దుర్గాపూర్‌, కోట, రామ్‌ఘంజ్‌, మండి, భవానీమండి, నగద, ఉజ్జయిని, సుజల్‌పూర్‌, భూపాల్‌, ఇటార్సీ, బెతుల్‌, ఆమ్లా, నర్‌ఖేర్‌, న్యూఅమరావతి, వార్జా, బలార్షా, వరంగల్‌, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరుల మీదుగా రేణిగుంటకు మర్నాడు మధ్యాహ్నం 1.35 గంటలకు చేరుకుంటుంది. 

అదే రైలు 09716 నంబరుతో తిరిగి రేణిగుంటలో డిసెంబర్ 16, 23, 30 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి వచ్చిన మార్గంలో మర్నాడు అర్థరాత్రి 12.20 గంటలకు జైపూర్‌ చేరుతుంది. ఈ ప్రత్యేక రైలులో సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌, సాధారణ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.