Apple 1 computer: ఆపిల్ వ్యవస్థాపకుడు 1976లో చక్కటి దస్తూరితో రాసిన లేఖ.. ఇప్పుడు ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?

ఆపిల్ కు చెందిన ఆ మొట్టమొదటి వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఒరిజినల్ కాపీని ఆర్ఆర్ ఆక్షన్ కంపెనీ వేలం చేసింది.

Apple 1 computer: ఆపిల్ వ్యవస్థాపకుడు 1976లో చక్కటి దస్తూరితో రాసిన లేఖ.. ఇప్పుడు ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?

Steve Jobs

Apple 1 computer – Steve Jobs: ఆపిల్ ఉత్పత్తులు ఎంతగా ఆకర్షణీయంగా ఉంటాయో, వాటి ధరలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. ఆపిల్ పాత ఉత్పత్తులను ఎంతో విలువైనవిగా చూస్తాం. మొదట తరానికి చెందిన ఇప్పటివరకు వాడని ఐఫోన్లు(iPhone) కూడా వేలంలో పదే పదే లక్షలాది రూపాయలకు అమ్ముడుపోతుంటాయి.

ఆపిల్ ఫోన్లంటే యూజర్లకు అంత పిచ్చి. ఇప్పుడు ఆ కంపెనీకి చెందిన ఓ లేఖ కూడా అతి భారీ ధరకు అమ్ముడుపోయింది. ఈ లేఖ ఆపిల్-1 కంప్యూటర్‌కు సంబంధించింది. ఆ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఈ ప్రకటనను స్వయంగా రాశారు.

ఆపిల్ కు చెందిన ఆ మొట్టమొదటి వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఒరిజినల్ కాపీని ఆర్ఆర్ ఆక్షన్ కంపెనీ వేలం చేసింది. ఇది ఏకంగా రూ.1.4 కోట్లు పలికింది. అంచనా వేసిన దానికంటే ఆరు రెట్లు అధిక ధర పలికిందని వేలం నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రకటనను స్టీవ్ జాబ్స్ 1976లో రాశారు. ఇందులో స్టీవ్ జాబ్స్ సంతకం కూడా ఉంది. స్టీవ్ జాబ్స్ ఆ సమయంలో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటి అడ్రస్, ఫోన్ నంబరును కూడా దీనిలో చూడొచ్చు.

ఈ లేఖను స్టీవ్ జాబ్స్ బ్లాక్ పెన్నుతో చక్కటి దస్తూరితో 8.5 x 11 పరిమాణ తెల్లకాగితంలో రాశారు. తమ ఉత్పత్తికి సంబంధించిన అన్ని వివరాలను జాబ్స్ సంక్షిప్తంగా చాలా అద్భుతంగా రాయడాన్ని ఇందులో చూడొచ్చు. ఆపిల్ ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆపిల్ ఐఫోన్ కొనుక్కోవాలని చాలా మంది కలలు కంటారు.

Vivo V29e Launch : కొత్త ఫోన్ కావాలా? రంగులు మార్చే ప్యానల్‌తో వివో V29e ఫోన్ ఇదిగో.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?