Tata EV Cars : పండగ చేస్కోండి.. ఈ 2 టాటా ఎలక్ట్రిక్ కార్లకు లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ.. పాత కస్టమర్లకు రూ. 50వేలు లాయల్టీ బెనిఫిట్స్..!

Tata EV Cars : టాటా మోటార్స్ కస్టమర్ల కోసం నెక్సాన్ EV, కర్వ్ EV కూపేపై లైఫ్‌టైమ్ HV బ్యాటరీ వారంటీని ప్రకటించింది.

Tata EV Cars : పండగ చేస్కోండి.. ఈ 2 టాటా ఎలక్ట్రిక్ కార్లకు లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ.. పాత కస్టమర్లకు రూ. 50వేలు లాయల్టీ బెనిఫిట్స్..!

Tata EV Cars

Updated On : July 10, 2025 / 6:57 PM IST

Tata EV Cars : టాటా ఈవీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. టాటా మోటార్స్ లైఫ్‌టైమ్ హై-వోల్టేజ్ (HV) బ్యాటరీ వారంటీని పొడిగించినట్లు ప్రకటించింది. ఇప్పుడు Curvv.ev SUV కూపే, Nexon.ev కార్లలో 45kWh బ్యాటరీలకు ఈ వారంటీ వర్తిస్తుంది. భారత మార్కెట్లో ఈవీ కార్లకు మరింత డిమాండ్ పెరుగుతున్న క్రమంలో టాటా మోటార్స్ ఈ కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీ కార్ల బ్యాటరీలకు లైఫ్ టైమ్ వారంటీని పొడిగించింది.

ఈ పాపులర్ మోడల్స్ కొనుగోలు చేసిన కొత్త కస్టమర్లతో పాటు పాత కస్టమర్లకు కూడా వారంటీని అందిస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేటప్పుడు బ్యాటరీని ఎప్పుడు మారుస్తారు? ఎంత ఖర్చవుతుంది? అనే ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు టాటా మోటార్స్ తమ కస్టమర్లకు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది.

లైఫ్‌టైమ్ HV బ్యాటరీ వారంటీ ఏంటి? :
టాటా మోటార్స్ ఇప్పుడు ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ కార్లపై లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీని అందిస్తోంది. బ్యాటరీపై కిలోమీటర్ లిమిట్ ఉండదు. అంటే.. మీరు ఎంత డ్రైవ్ చేసినా, బ్యాటరీ వారంటీ అలాగే ఉంటుంది. ఈ ఫీచర్ గతంలో హారియర్ ఈవీ కార్లలో మాత్రమే ఉండేది. కస్టమర్ల నుంచి భారీగా రెస్పాన్స్ రావడంతో టాటా కంపెనీ ఇప్పుడు నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీలకు విస్తరించింది.

ఎవరికి బెనిఫిట్..? :
కొత్త కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు మాత్రమే కాదు.. ఇదివరకే ఈవీ కార్లను కొనుగోలు చేసిన పాత కస్టమర్లు కూడా ఈ వారంటీని పొందవచ్చు. ఇప్పటికే టాటా ఈవీ కార్లను కలిగిన కస్టమర్లు (Tiago.ev, Tigor.ev) ఇప్పుడు నెక్సాన్ EV 45kWh లేదా కర్వ్ EV కొనుగోలు చేయడం ద్వారా రూ. 50వేల లాయల్టీ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Read Also : Google Pixel 8a : బిగ్ డిస్కౌంట్ భయ్యా.. భారీగా తగ్గిన గూగుల్ పిక్సెల్ 8a ఫోన్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!

10ఏళ్లలో 9లక్షల వరకు ఆదా :
బ్యాటరీ రిప్లేస్‌మెంట్ విషయంలో కస్టమర్లకు ఆందోళన అక్కర్లేదు. అత్యంత ఖరీదైన బ్యాటరీ రిప్లేస్‌మెంట్ ఇప్పుడు ఫ్రీ వారంటీతో పొందవచ్చు. బ్యాటరీ రీసేల్ వాల్యూ పెరుగుతుంది. బ్యాటరీ వారంటీ మార్కెట్లో ఈవీ వాల్యూను పొందుతుంది. అంటే.. 10 ఏళ్లలో రూ. 8 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు ఆదా అవుతుంది. ఈవీ మేనేజ్‌మెంట్, ఇంధన ఖర్చు పెట్రోల్ కార్ల కన్నా చాలా తక్కువ ఉంటుంది.

కస్టమర్లకు టాటా భరోసా :
టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ CCO వివేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఈవీ కార్లను కొనుగోలు చేశాక కస్టమర్లు నిశ్చింతగా ఉండవచ్చునని అన్నారు. లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.

టాటా మోటార్స్ లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ ప్రకటనతో భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గేమ్ ఛేంజర్‌గా మారనుంది. ఇతర కంపెనీలు 6 ఏళ్లు నుంచి 8 ఏళ్ల బ్యాటరీ వారంటీని మాత్రమే అందిస్తున్నాయి.