Year-End Sale 2025 : ఇయర్ ఎండ్ సేల్ ఆఫర్లు.. ఈ టాటా సఫారీ SUVపై ఏకంగా లక్షకుపైగా డిస్కౌంట్.. చవకైన ధరకే కొత్త కారు ఇంటికి తెచ్చుకోండి..!
Tata Safari Discounts 2025 : టాటా సఫారీ కార్లపై ఇయర్ ఎండ్ సేల్ అందిస్తోంది. ఈ డిసెంబర్ నెలలో ఎస్ యూవీ కార్లపై ఏకంగా లక్షకు పైగా డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Tata Safari Discounts 2025
Tata Safari Discounts 2025 : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అనేక బ్రాండ్ల కార్లపై 2025 ఇయర్ ఎండ్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. తాజాగా టాటా మోటార్స్ కూడా డిసెంబర్ 2025 ఇయర్ ఎండ్ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఇయర్ ఎండ్ సేల్స్ పురస్కరించుకుని కంపెనీ సఫారీ SUVపై రూ. లక్షకు పైగా తగ్గింపు అందిస్తోంది. కంపెనీ అందించే అత్యంత ప్రీమియం కార్లలో ఇదొకటిగా చెప్పొచ్చు.
అవసరమైతే టాటా సఫారీ ఎలక్ట్రిక్ మోడల్‌లో కూడా కొనేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వేరియంట్‌పై కంపెనీ లక్ష తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ SUV మోడల్ 170hp, 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది. MT లేదా AT గేర్‌బాక్స్‌తో వస్తుంది. సఫారీ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 14.66 లక్షల నుంచి రూ. 25.96 లక్షల మధ్య ఉంటాయి. ఉంటాయి. ఇందులో డార్క్, స్టీల్త్ వేరియంట్‌లు కూడా లభ్యమవుతున్నాయి.
టాటా సఫారీపై డిస్కౌంట్లు :
టాటా సఫారీపై డిస్కౌంట్ల విషయానికి వస్తే.. ఈ SUV హై-స్పెక్ వేరియంట్‌లకు రూ. 75వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు పాత MY2025 మోడల్‌ను ఎంచుకుంటే.. మీకు రూ. లక్ష వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 2025 చివరిలో లక్షల విలువైన డిస్కౌంట్ పొందడానికి ఇదే బెస్ట్ టైమ్.
దాదాపు అన్ని ఆటోకంపెనీలు డిసెంబర్‌కు ముందు కార్ల ఉత్పత్తిని ఆపివేస్తాయి. 2025లో తయారైన కార్లు జనవరి 2026 నాటికి ఒక ఏడాది పాతవి అవుతాయి. అందుకే పాత స్టాక్ అంతా క్లియర్ చేస్తారు. అందుకే జనవరిలో ఇలాంటి పాత కార్లను కొనుగోలు చేసేవారు ఉండరు. డీలర్లు స్టాక్‌ను క్లియర్ చేసేందుకు MY2025పై లక్షల విలువైన డిస్కౌంట్‌లను ప్రకటిస్తుంటారు.
త్వరలోనే న్యూ జనరేషన్ సఫారీ మోడల్ :
టాటా మోటార్స్ కొత్త జనరేషన్ సఫారీ SUV కోసం సన్నద్ధమవుతోంది. అయితే, ఈ కారు లాంచ్‌కు మరికొంత సమయం పడుతుంది. ఈ కొత్త జనరేషన్ SUV పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై రెడీ అవుతోంది. ఇంటర్నల్ దహన యంత్రం (ICE), ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పవర్‌ట్రెయిన్‌లకు అలాగే AWD టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. ప్రస్తుత జనరేషన్ సఫారీ ల్యాండ్ రోవర్ D8 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇంకా, ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ SUV కారు ప్రస్తుత మోడల్ కన్నా కాస్త పొడవుగా ఉంటుంది.
ఈ SUV కారులో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కంపెనీ కొత్త ప్లాట్‌ఫామ్ డెవలప్ చేస్తోంది. 4×4 డ్రైవ్ సిస్టమ్‌తో పాటు ICE ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కలిగి ఉంది. మహీంద్రా NFA యూనిట్ మాదిరిగానే అభివృద్ధి చేస్తోంది. టాటా సఫారీ స్టెల్త్ ఎడిషన్ కారు డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్ లెవెల్-2 అడాస్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. స్టెల్త్ ఎడిషన్ SUV లోపలి భాగంలో బ్లాక్ లెదర్ అప్హోల్స్టరీ కూడా ఉంది. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
