Krithi Shetty: హోటల్ లో నిజమైన దెయ్యాన్ని చూశాను.. వణుకుతూ లైట్ వేసాను.. సడన్ గా పెద్ద శబ్దం..

కృతి శెట్టి(Krithi Shetty) ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు నిజమైన దెయ్యం కనిపించింది అంటూ చెప్పుకొచ్చింది.

Krithi Shetty: హోటల్ లో నిజమైన దెయ్యాన్ని చూశాను.. వణుకుతూ లైట్ వేసాను.. సడన్ గా పెద్ద శబ్దం..

Krithi Shetty made shocking comments saying she saw a real ghost

Updated On : December 10, 2025 / 4:44 PM IST

Krithi Shetty: దేవుళ్ళు, దెయ్యాలు.. ప్రస్తుతం కాలంలో చాలా మంది ఈ టాపిక్ లను పెద్దగా పాటించుకోరు. మాట్లాడటానికి ఇష్టపడరు కూడా. ఒకవేళ ఏవైనా చెప్తే వారిని వింతగా చూస్తారు. నవ్వుకుంటారు. ఈకాలంలొ కూడా అలాంటివి నమ్ముతారా అంటూ కొట్టిపారేస్తారు. కానీ, స్టార్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) మాత్రం నిజమైన దెయ్యాన్ని చూశానని చెప్తోంది. అలా చూడగానే ఒంట్లో వణుకు పుట్టింది అంటూ తనకు ఎదురైన భయానకమైన సంఘటనను చెప్పింది. తాజాగా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా వా వాతియార్. తెలుగులో ఈ సినిమా అన్నగారు వస్తారు అనే టైటిల్ తో విడుదల కానుంది.

Yamini Bhaskar: ఇండస్ట్రీలో ఎదవలు ఉన్నారు.. ఇబ్బందులు పెట్టారు.. కాస్టింగ్ కౌచ్ పై యామిని షాకింగ్ కామెంట్స్

టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు నిజమైన దెయ్యం కనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. “వా వాతియారు సినిమాలో నేను ఆత్మలతో మాట్లాడే జీపీసీ పాత్ర చేశాను. అయితే, షూటింగ్ కోసం నేను, అమ్మ ఒక హోటల్ లో ఉన్నాము. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో నాకు ఒక ఆత్మ కనిపించింది. భయమేసింది. మెల్లిగా వెళ్లి లైట్ వేశాను. పెద్ద శబ్దం వచ్చింది. ఆ ఆత్మ కూడా మాయం అయ్యింది. ఆరోజు నాతోపాటు మా అమ్మ కూడా ఉంది కాబట్టి బతికిపోయాను. లేదంటే, నా గుండె ఆగిపోయేది” అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి.

దీంతో ఈ అమ్మడు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కృతి మాటలు విన్న నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కృతిలో ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు. సినిమాలో ఆత్మలతో మాట్లాడే పాత్ర చేశారు కాబట్టి. అలా అనిపించింది. కానీ, నిజంగా దెయ్యాలు, భూతాలు ఉండవు. కాస్త రియాలిటీలోకి రండి మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.