Yamini Bhaskar: ఇండస్ట్రీలో ఎదవలు ఉన్నారు.. ఇబ్బందులు పెట్టారు.. కాస్టింగ్ కౌచ్ పై యామిని షాకింగ్ కామెంట్స్
రభస సినిమాతో టాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చింది యామిని భాస్కర్(Yamini Bhaskar). ఆ తరువాత హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ చాలా సినిమాలే చేసింది.
Yamini Bhaskar shocking comments on casting couch
Yamini Bhaskar: రభస సినిమాతో టాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చింది యామిని భాస్కర్(Yamini Bhaskar). ఆ తరువాత హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ చాలా సినిమాలే చేసింది. భలే మంచి చౌక బేరము, కొత్తగా మా ప్రయాణం,నర్తనశాల, కాటమరాయుడు వంటి సినిమాల్లో నటించింది. కానీ, అనుకున్న సక్సెస్ అందుకోలేకపోయింది. చాలా గ్యాప్ తరువాత యామిని భాస్కర్ చేస్తున్న సినిమా సైక్ సిద్దార్థ. సిద్దు హీరోగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరించింది.
Kriti Sanon: హీరోలందరూ పొట్టివాళ్లే.. నాముందు హీల్స్ వేసుకుంటారు.. మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్..
ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఎదవలు ఉన్నారు. నాకు కూడా ఎదురయ్యారు. కెరీర్ మొదట్లో బాగానే ఉంది. కానీ, మధ్యలో కొంతమంది అలా తగిలారు. అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో తెలియక ఇండస్ట్రీనే వదిలేద్దాం అనుకున్నాను. అందుకే చాలా కాలంగా సినిమాలు చేయడం లేదు. అందరు కాదు. కొంతమంది మాత్రమే అలా ఉన్నారు. మేల్ డామినేషన్ చూపిస్తారు. అమ్మాయిలను తక్కువగా చూస్తారు. అవకాశం కోసం ఏదైనా చేస్తారు అనే ఆలోచనలో ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు భయమేసేది. ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. దాంతో నాకు యాటిట్యూడ్ అనుకున్నారు.
కేవలం మగవాళ్ళు మాత్రమే ఆలా ఉన్నారని నేను చెప్పను. ఈమధ్య ఆడవాళ్లు కూడా అలానే తయారయ్యారు. అవి తెలిసి నేను షాక్ అయ్యాను. భయపడకుండా అలాంటి వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి”అంటూ చెప్పుకొచ్చింది యామిని భాస్కర్. దీంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చాలా కాలం గ్యాప్ తరువాత యామిని చేస్తున్న ఈ సినిమా ఆమెకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుంది అనేది చూడాలి.
