Kriti Sanon: హీరోలందరూ పొట్టివాళ్లే.. నాముందు హీల్స్ వేసుకుంటారు.. మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్..

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించింది. మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే, నాగ చైతన్యతో దోచేయ్, ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలు చేసింది.

Kriti Sanon: హీరోలందరూ పొట్టివాళ్లే.. నాముందు హీల్స్ వేసుకుంటారు.. మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్..

Heroine Kriti Sanon makes shocking comments on heroes height

Updated On : December 10, 2025 / 3:05 PM IST

Kriti Sanon; బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించింది. మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే, నాగ చైతన్యతో దోచేయ్, ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలు చేసింది. కానీ, బాలీవుడ్ లో లాగా ఇక్కడ అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఆమె చేసిన ఈ మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆమెకు మన తెలుగు డైరెక్టర్ అవకాశాలు ఇవ్వడం లేదు. తాజాగా ఈ బ్యూటీ నటించిన సినిమా ‘తేరే ఇష్క్ మే’. తమిళ స్టార్ ధనుష్ హీరోగా వచ్చిన ఈ హిందీ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

Sandeep Raj: నేను సింపతీ కోసం చేయలేదు.. మళ్ళీ వాయిదా అనేసరికి బాధేసింది.. అఖండ 2పై కోపం లేదు..

ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్(Kriti Sanon) తనతో నటించిన హీరోగా గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తనతో నటించిన చాలా మంది హీరోలు తనకన్నా పొట్టివారే అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ కృతి ఎత్తు గురించి ప్రస్తావంచింది. దానికి సమాధానంగా కృతి మాట్లాడుతూ..”అవును నేను ఎత్తుగా ఉంటాను. నాపక్క నటించిన హీరోల్లో చాలా మంది నాకంటే తక్కువ ఎత్తు ఉన్నవారే ఉన్నారు. వాళ్ళు నాముందు హీల్స్ వేసుకునేవారు. నేను మాత్రలు ఫ్లాట్ గా ఉండే ఫోర్ వేర్ వేసుకునే దాన్ని. ప్రభాస్, అర్జున్ కపూర్ లాంటి వారు మాత్రమే నా కంటే ఎత్తుగా ఉంటారు”అంటూ చెప్పుకొచ్చింది.

కృతి చేసిన ఒక్క కామెంట్స్ ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. తనతో నటించిన అందరు హీరోలు పొట్టిగా ఉంటారు అని ఎలా అంటుంది. మహేష్ బాబు హైట్ తనకు తెలియదా. వన్ నేనొక్కడినే మూవీ చేసింది కదా. ఆమాత్రం గుర్తులేదా. మహేష్ బాబు కృతి సనన్ కంటే హైట్ ఉంటారు. కానీ, ఆమె ప్రభాస్, అర్జు కపూర్ లో పేర్లు మాత్రమే ప్రస్తావించడం ఏంటి. ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచింది మాట్లాడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న ఈ కామెంట్స్ కి కృతి ఎలా స్పందిస్తుందో చూడాలి.