TTD Scam: టీటీడీలో మరో కుంభకోణం..! భక్తులకు కప్పే పట్టు వస్త్రం కొనుగోలులో భారీ మోసం..!
వేద ఆశీర్వచనం టికెట్టు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ వస్త్రాన్ని కప్పి ఆశీర్వదించడం ఆనవాయితీగా వస్తోంది.
TTD Scam: టీటీడీలో మరో కుంభకోణం వెలుగుచూసింది. ఆలయంలో భక్తులకు కప్పే పట్టు వస్త్రం కొనుగోలులో భారీ మోసం జరిగినట్లు తెలుస్తోంది. మల్బరీ పట్టు వస్త్రం పేరిట పాలిస్టర్ వస్త్రం కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. నగరికి చెందిన VRS ఎక్స్ పోర్ట్స్, దాని అనుబంధ మరో మూడు సంస్థలు 2015 నుంచి 2025 వరకు టీటీడీకి ఈ వస్త్రాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన సప్లయ్ చేశాయి. ఒక్కో వస్త్రం ఖరీదు 1389 రూపాయల లెక్కన 21 వేల వస్త్రాలు టీటీడీ కొనుగోలు చేసింది.
టీటీడీకి సరఫరా చేసిన ఈ వస్త్రంలో పట్టులేదని, పాలిస్టర్ ఉందని బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ లేబరేటరీలో జరిపిన పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ఈ కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తు జరపాలని టీటీడీ పాలక మండలి తాజాగా నిర్ణయించింది. వేద ఆశీర్వచనం టికెట్టు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ వస్త్రాన్ని కప్పి ఆశీర్వదించడం ఆనవాయితీగా వస్తోంది. బహిరంగ మార్కెట్ లో ఈ పాలిస్టర్ వస్త్రం (దుప్పట్ట) ఖరీదు 200 రూపాయలకు మించి ఉండదని ఒక అంచనా.
Also Read: ఏపీలోని రైతులకు భారీ ఊరట.. రూ. 100 చెల్లిస్తే చాలు.. ఆ భూములు మీ సొంతం..
