Post Office Schemes : టాక్స్ పేయర్లకు అలర్ట్.. ఆదాయ పన్ను మినహాయింపు అందించే 6 అద్భుతమైన పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్ మీకోసం..

Post Office Schemes : పన్నుచెల్లింపుదారులు PPF, NSC, KVP, SSY, SCSS వంటి పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

Post Office Schemes : టాక్స్ పేయర్లకు అలర్ట్.. ఆదాయ పన్ను మినహాయింపు అందించే 6 అద్భుతమైన పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్ మీకోసం..

Post Office Savings Schemes

Updated On : March 16, 2025 / 12:15 PM IST

Post Office Savings Schemes : పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌లలో పెట్టుబడి పెడుతున్నారా? మీకు ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు చేయాల్సిందిల్లా ఈ సేవింగ్స్ పోస్టాఫీస్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడమే.. అయితే, ఏయే పోస్టాఫీసు స్కీమ్‌‌లలో ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు తెలుసా?

ఈ ఏడాది జూలైలో ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే సమయంలో మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే.. ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసేందుకు అర్హులుగా చెప్పవచ్చు.

Read Also : Best Mobiles 2025 : కొత్త ఫోన్ కావాలా? రూ. 30వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి!

ఆదాయపు పన్ను (IT) చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద మినహాయింపును క్లెయిమ్ చేసేందుకు అనేక పన్ను ఆదా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 80C కింద ఆదాయపు పన్ను మినహాయింపును అందించే పోస్ట్ ఆఫీస్ పథకాల (PPF, NSC, KVP, SSY, SCSS) గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పన్ను మినహాయింపు అందించే 6 పోస్టాఫీస్ పథకాలివే :
1. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): పెట్టుబడిదారులు కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాలి. రూ. 30 లక్షలకు మించకూడదు. ఈ పథకం ఏడాదికి 8.2 శాతం వడ్డీని అందిస్తుంది. మొదటి దశలో డిపాజిట్ చేసిన తేదీ నుంచి మార్చి 31/సెప్టెంబర్ 30/డిసెంబర్ 31 వరకు చెల్లించాలి. ఆ తర్వాత, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, జనవరి 1 తేదీలలో వడ్డీ చెల్లించాలి.

2. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) : ఈ పథకం సంవత్సరానికి 7.1 శాతం వడ్డీని అందిస్తుంది. పెట్టుబడిదారులు సంవత్సరానికి రూ. 500 నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

3. సుకన్య సమృద్ధి అకౌంట్ (SSA): ఈ పథకం కింద ఒక ఆర్థిక ఏడాదిలో రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల మధ్య పెట్టుబడిని పెట్టవచ్చు. పెట్టుబడిదారులకు సంవత్సరానికి 8.2 శాతం వడ్డీని అందిస్తుంది. డిపాజిట్లు ఓపెన్ చేసిన తేదీ నుంచి గరిష్టంగా 15 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.

4. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC): ఈ పథకం కింద సంవత్సరానికి 7.7 శాతం చక్రవడ్డీని అందిస్తుంది. కానీ, మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. ఈ NSCలో కనీస పెట్టుబడి రూ. 1,000 ఉండగా గరిష్ట పరిమితి మాత్రం లేదు. పెట్టుబడి 5 ఏళ్ల వ్యవధి తర్వాత మెచ్యూరిటీ చెందుతుంది.

5. వి. కిసాన్ వికాస్ పత్ర (KVP) : కనీస పెట్టుబడి రూ. 1,000, గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. వార్షికంగా 7.5 శాతం చక్రవడ్డీని అందిస్తుంది.

6. పోస్టాఫీస్ 5 ఏళ్ల టైమ్ డిపాజిట్ : పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్లు వేర్వేరు టైమ్ పీరియడ్ కలిగి ఉంటాయి. ఒక ఏడాది, రెండు ఏళ్లు, మూడు ఏళ్లు లేదా ఐదు ఏళ్లు. 5 ఏళ్ల డిపాజిట్ అకౌంట్ కింద పెట్టుబడి ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద ప్రయోజనం పొందవచ్చు. సంవత్సరానికి 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలు అందించే దాని కన్నా చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.

Read Also : Income Tax : పన్నుచెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించకతప్పదు!

డిపాజిట్ చేసిన తేదీ నుంచి 6 నెలల గడువు ముగిసేలోపు డిపాజిట్‌ను విత్‌డ్రా చేయలేని పెట్టుబడిదారులు ఇది తప్పక తెలుసుకోవాలి. టర్మ్ డిపాజిట్ అకౌంట్ 6 నెలల తర్వాత కానీ, ఒక ఏడాది ముందు క్లోజ్ చేస్తే (PO) సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు వర్తిస్తుంది.

పన్ను చెల్లింపుదారులకు గరిష్టంగా సంవత్సరానికి రూ. 1.5 లక్షలు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టినా సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు మాత్రమే మినహాయింపు పొందవచ్చు.